విశాఖపట్నం

సీనియర్లు వౌనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో సతమతమవుతోందా? పార్టీలో సీనియర్ల అనుభవాన్ని అథిష్ఠానం వినియోగించుకోలేకపోతోందా? పార్టీ బలోపేతానికి కావల్సిన వ్యూహాలు చెప్పడానికి సీనియర్లు సిద్ధంగా ఉన్నా, వినడానికి అథినాయకులు, జిల్లా నాయకులు సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది. ప్రజల్లో పార్టీకి కాసింత మెరుగైన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో పార్టీ అథిష్ఠానం విఫలమవుతోందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే! అన్న ధీమాతో పార్టీ నాయకత్వం పనిచేస్తోంది. దీంతో పార్టీ క్యాడర్‌లో నిర్లిప్తతం, స్తబ్దత నెలకొంది.
గత ఎన్నికల్లో అతి విశ్వాసం పార్టీ ఫలితాలపై తీవ్రంగా కనిపించింది. ఇది ఒక గుణపాఠంగా తీసుకుని, అందుకు భిన్నంగా వ్యవహరించి ముందుకు వెళితే, బాగుండేది. కానీ ఇప్పటికీ, అదే అతి ధీమాతో పార్టీ, శ్రేణులు ముందుకు వెళ్లడం వేసిన తప్పడుగునే మళ్లీ మళ్లీ వేస్తున్నట్టు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలో ఘోర పరాజయాన్ని చవిచూసిందనడానికి విజయమ్మ ఓటమే ఒక ఉదాహరణ. నాటి ఎన్నికల్లో జరిగిన లోపాలను సరిచేసుకునే ప్రయత్నం ఇప్పటికీ చేయలేకపోయింది పార్టీ అథిష్ఠానం. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగితే, అందులో విజయకేతనాన్ని ఎగురవేయాలని వైకాపా భావిస్తోంది. కానీ అందుకు తగిన కార్యాచరణ ఎక్కడా జరగడం లేదు. ముఖ్యంగా స్థానిక సమస్యలపై పార్టీ ఆందోళన కార్యక్రమాలు పెద్దగా చేపట్టడం లేదు. గడపగడపకు వైకాపా కూడా అథినేత ఆశించిన స్థాయిలో జరగలేదు. స్థానిక నాయకుల్లో సమన్వయం పూర్తిగా కొరవడింది. జిల్లా నాయకత్వంపై కొంతమంది సీనియర్లకు విశ్వాసం లేదు. కొద్ది రోజుల కిందట జిల్లా అధ్యక్షుడు అమర్ నాయకత్వంలో రైల్వే జోన్ కోసం జరిగిన ఆత్మగౌరవ యాత్ర పార్టీకి పెద్దగా మైలేజ్ తీసుకురాలేదు. పార్టీలో సీనియర్లు, క్యాడర్ పెద్దగా సహకరించకపోవడమే ఇందుకు కారణం. రైల్వే జోన్‌పై విశాఖ ప్రజల్లో సెంటిమెంట్ ఏ మేరకు ఉందన్న విషయాన్ని తెలుసుకోకుండానే, అమర్ పాదయాత్ర మొదలుపెట్టారని పార్టీలోని సీనియర్లు అంటున్నారు. అలాగే జిల్లా నాయకత్వంపై కూడా వారు పెద్ద విశ్వాసంతో లేరన్నది స్పష్టమవుతోంది.
సీనియర్లు ఇంత అసంతృప్తిగా ఉండడానికి మరో కారణం కూడా లేకపోలేదు. అటు పార్టీ అథినేత కానీ, ఇటు జిల్లా నాయకుడు కానీ తమ సీనియార్టీని గౌరవించడం లేదన్న వేదన వారిలో ఉంది. ఉదాహరణకు విశాఖ నగరంలోని కొన్ని నియోజకవర్గాల్లో వైకాపాకు ప్రజల మద్దతు ఉంది. దాన్ని ఏరీతిలో తమకు అనుకూలంగా మలచుకోవాలోనన్న వ్యూహాలు సీనియర్ల వద్ద ఉన్నాయి. వాటిని అడిగిన వారే కనిపించడం లేదని అంటున్నారు. అలాగే టిడిపి, బిజెపిలు విఫలమైన నియోజకవర్గాల్లో వైకాపా జెండాను రెపరెపలాడించాలన్నా, అథిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఎవరికి వారు స్తబ్దుగా ఉండిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, జిల్లాలో పార్టీ ఇప్పట్లో బలోపేతమయ్యే పరిస్థితుల్లేవని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.