విశాఖపట్నం

మాస్టర్ ట్రైనర్స్ నియామక ఏర్పాట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 20: ఎపి ఉన్నత విద్యామండలి, బ్రిటిష్ కౌన్సిల్ వారి సౌజన్యంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ ఫర్ ఎంప్లారుూబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ఏర్పాటైన పైలెట్ ప్రాజెక్టులో మాస్టర్ ట్రైనర్స్ నియామక ప్రక్రియలో భాగంగా జరిగే ఇంటర్వ్యూ ఏర్పాటును ఎయు వైస్-్ఛన్సలర్ ఆచార్య నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ఈ పైలట్ ప్రాజెక్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల నుండి ఎయూ కేంద్రానికి 61 మందిని కేటాయించారు. ఇదే తీరున నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, ఎస్వీ యూనివర్సిటీ తిరుపతిలో కూడా జరుగుతున్నాయి. ఏయూ కేంద్రానికి ప్రాజెక్టు నోడల్ అధికారిగా ఆచార్యా జి.సుధాకర్ వ్యవహరిస్తున్నారు.
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ఆంధ్రవిశ్వకళాపరిషత్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రయోగశాలల సమదాయ భవంతిని నిర్మాణపనులను ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు పరిశీలించారు. నాణ్యతలోపాలు లేకుండా భవన నిర్మాం జరగాలని అలాగే సకాలంలో నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఇంజనీరింగ్ కళాశాల అధికారులు, విద్యాలయ చీఫ్ ఇంజనీర్ మాధవబాబు తదితరులు పాల్గొన్నారు.
మెప్మాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

విశాఖపట్నం, ఏప్రిల్ 20: మెప్మా సంస్థలో కమ్యూనిటీ ఆర్గనైజర్లుగా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ నిమిత్తం ఏపీలో 550 పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్టు యుసిడి ప్రాజెక్టు డైరెక్టర్ డి.శ్రీనివాసనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై, ఐదేళ్ళపాటు ఏదైనా ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్‌థలు,సంఘాల్లో అనుభవం కలిగి ఉండాలన్నారు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు వయోపరిమితిలో సడలింపుతోపాటు 45 ఏళ్ళ వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. టౌన్‌లెవెల్ ఫెడరేషన్ రిసోర్సు పర్సన్సు, క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్లకు కూడా ఐదేళ్ళ వయోపరిమితి సడలింపుతో పాటు 45 ఏళ్ళ వయస్సు ఉండాలి. స్వచ్చంధ సంస్థల్లో పనిచేసిన వారు, పేదరిక నిర్మూలన కోసం ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్షర ద్వారా ఉంటుంది. కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకుని అదే అప్లికేషన్ హార్డ్ కాపీని ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలెప్‌మెంట్ ఇనిస్టిట్యూట్, నియర్ గుంటూరు ఫైఓవర్, బాపట్ల-522101, గుంటూరు జిల్లాకు ఏప్రిలర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు చేరే విధంగా పంపించాలన్నారు. రాత పరీక్ష తేదీ, హాల్‌టికెట్, పరీక్షా కేంద్రం వివరాలను ఏపిహెచ్‌ఆర్‌డి వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన పేర్కొన్నారు.