విశాఖపట్నం

నవ శకాల భావ నివేదన చిట్టెడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారులకు ఆలోచనలు రేకెత్తించేవి, విలువలు పెంచేవి, జ్ఞానవంతులుగా తయారు చేయగలిగేవి కథలు అనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే చిన్నారులకు సరిపడే కథలను సంకలనం చేసి వాటిని ‘చిట్టెడు చిట్టికథలు’ పేరిట సృజన విశాఖ భావావిష్కరణ వేదికగా మన ముందుకు తెచ్చినవారు గుండాన జోగారావు. దీనిని సాహిత్య సృజనం-5 అనే సంచికగా విడుదల చేశారు. ఇందులో ముప్ఫై మంది రచయితల కలాల నుండి జాలువారిన చిన్నచిన్న కథలు సమ్మితమై పాఠకలోకాన్ని పరవశింపజేశాయి.
చదువంటే కొనలేనిదని, దాన్ని మనం సముపార్పించుకోవాలని ‘చదువుకొనలేము’ కథలో రచయిత చెప్పిన తీరు చదువు పట్ల ఆసక్తిని రేకెత్తుతుంది. స్మార్ట్‌సిటీ పేరిట పర్యావరణాన్ని ఉరికంబం ఎక్కిస్తున్నారని, జీవులు తమ ఉనికిని కోల్పోతున్నాయని మూగజీవుల వేదనను ‘నిర్ణయం’ అనే కథలో సాయిప్రకాష్ తెలియజేశారు. ఆడపిల్లలు ఆస్తులు పంచుకోవడమే కాదు బాధ్యతలూ పంచుకోవాలని ‘శ్రీమతి ఒక బహుమతి’లో ఆదిమధ్యం జానకి చెప్పారు. నిజమైన ప్రేమ, మనసు పెట్టి చేసే పని దేవుని పూజతో సమానమని ‘మనసంతా నువ్వే’ కథలో సుబ్రహ్మణ్యం వివరించారు. కాంట్రాక్టు కార్మికుల బతుకులు ఎలా ఉంటాయో వారి, వారి వెట్టిచాకిరీ బతుకుల గురించి సునీతాదేవి వివరించారు. పిల్లికి బిచ్చం పెట్టని వాడు పుష్కరాలకు బయలుదేరగా అందరూ ముక్కున వేలేసుకున్న విషయాన్ని ‘పిండమే ప్రదానం కథలో చినరామారావు సాక్షాత్కరించారు. చిరుద్యోగికి అదనపు ఖర్చులు తోడైతే జీవితం ఎలా ఉంటుందనేది నల్లపాటి సురేంద్ర వ్యక్తీకరించారు. బహుమతిని ప్రతిభతో సాధించాలి. మోసంతో కాదని ‘దురాశ’ కథలో చెప్పిన ప్రియాంక, పిల్లలను ప్రోత్సహించాలే గాని పొగడకూడదని, అలా చేస్తే ఏమవుతుందో ‘ ఆయుక్షీణం’ కథ ద్వారా ఆచార్య సూర్యప్రకాశరావు తెలియజేసిన తీరు ఆకట్టుకుంటుంది. మిత్రులంటే ఎంత కలసి మెలసి ఉంటారో ‘చిన్న అబద్ధం’ కథ ద్వారా తెలిపిన రొంగలి గాయత్రి, ఆత్మ విశ్వాసం ఉంటే కొండనైనా మోయగలమని, మనిషికి విశ్వాసం ముఖ్యమని తెలిపిన మాధవీ సనారా కథ ‘ ఆకలి’ పాఠకుల్ని ఆకట్టుకుంటుంది. ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ‘మానవత్వం పరిమళించే’ కథలో మానవత్వాన్ని చాటిన రామలక్ష్మి ఆకట్టుకున్నారు. ‘స్నేహం’ కథలో పైచదువులకు ఆర్థిక స్థోమత లేని వారికి స్నేహితులు తోడ్పడిన తీరును డాక్టర్ నళినీకుమారి తెలిపారు. నా కష్టానికి మించిన డబ్బు అక్కరలేదని, లంచాలు దిగమించే ఈ కాలంలో ముసలివాని వ్యక్తిత్వాన్ని పరిచయం చేసి పద్మావతి ‘ ఎవరు గొప్ప’ రచన ఆకట్టుకుంటుంది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న అరాచకాలు చూడలేక, కాలుష్యం, శబ్దాలు వినలేక భగవంతుడు గర్భగుడిలో శిల్పంగా ఉండిపోయాడని ‘కాలుష్యం’ పేరిట విశే్వశ్వరరావు మన ముందుంచారు. హుదుద్ వలన పచ్చదనం కోల్పోయిన ప్రాంతాలకు కంపెనీలకని భూములు ప్రభుత్వం ఇస్తుంటే మొక్కలు ఎలా పెంచుతాం అంటూ ముసలాయన మాటల్ని ‘తుపాను’ కథలో సన్యాసిరాజు వర్ణించారు. అమ్మ కమ్మని తత్వాన్ని, స్పర్శను తెలియజేస్తూ పెళ్లాం వస్తే అమ్మను చూస్తుందో ‘నేను అమ్మను’ కథ ద్వారా పాఠకులకు అందించారు శ్రీమణి. ఇలా పలువురు రచయితలు తమ కథల ద్వారా పాఠకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

- కుబిరెడ్డి చెల్లారావు, చోడవరం, విశాఖ జిల్లా. సెల్ : 9885090752.