విశాఖ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణిగా ఉమాసుందరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, మే 1: జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారిణిగా డాక్టర్ ఉమాసుందరిని ఇన్‌చార్జిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డాక్టర్ సరోజని పదవీవిరమణతో ఏర్పడిన ఖాళీని ఈమెతో భర్తీ చేసినట్టు అయ్యింది. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రాంతీయ కార్యాలయానికి రీజనల్ డైరెక్టర్‌గా ప్రస్తుతం విజయవాడలో అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సావిత్రిని విశాఖ ఆర్‌డిగా నియమించారు. ఈమె గతంలో విశాఖ డిఎం అండ్ హెచ్‌ఓగా విధులు నిర్వహించారు. అదేవిధంగా రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (మేల్) ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న భారతీరెడ్డికి అడిషనల్ డిఎం అండ్ హెచ్‌ఓగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరంతా రెండు రోజుల్లో విధులు చేరే అవకాశం ఉంది. ఇన్‌చార్జి డిఎం హెచ్‌ఓగా నియమించిన ఉమాసుందరి ప్రస్తుతం రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (్ఫమేల్) విశాఖలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈమె గ తంలో విక్టోరియా ఆసుపత్రికి ఆర్‌ఎంఓగా, తూర్పుగోదావరి జిల్లాకు డిఎం అండ్ హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహించారు. ఈ నియామకంపట్ల జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తంచేశారు. అయితే ఈనెలాఖరిలో ఆరోగ్యశాఖలో జరుగనున్న కౌనె్సలింగ్‌లో కొత్త అధికారిణి నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.