విశాఖపట్నం

గంటాకు 8... అయ్యన్నకు 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 18 : పనితీరు ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సహచర మంత్రులకిచ్చిన ర్యాంకులపై జిల్లా తెదేపా వర్గాల్లో భిన్న వానదలు వినిపిస్తున్నాయి. మానవ వనరుల శాఖ మంత్రికి గంటా శ్రీనివాసరావుకు 8వ ర్యాంకు రాగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్నన్నపాత్రుడికి 10వ ర్యాంకు లభించడం జిల్లా తెదేపా వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. గత కొంత కాలంగా రాఫ్ట్రంలో చోటు చేసకున్న పరిణామాలే కొలమానంగా ర్యాంకులు ఇచ్చి ఉంటారని తెదేపా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా కాపు ఉద్యమ నేపథ్యంలో ఆయా వర్గాలను విస్మరించరాదని భావించే ర్యాంకుల అంశాన్ని తెర మీదకు తెచ్చారని భావిస్తున్నారు. జిల్లాలో ఇద్దరుమంత్రుల మధ్య సయోధ్య లేని సందర్భంలో ఈ ర్యాంకుల ప్రకటన మరింతగా సమస్యలను పెంచుతుందని తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ మంత్రి అయ్యన్న పనితీరును శంకించే అవకాశం లేనప్పటికీ ర్యాంకు విషయంలో వెనుకబడడం చర్చకు దారి తీస్తోంది. ఇదే సందర్భంలో మంత్రి గంటా సీనియర్ అయ్యన్నను అధిగమించి 8వ ర్యాంకు దక్కించుకోవడం గంటా వర్గీయులను ఆనందంలో ముంచెత్తుతోంది. సి ఎం చంద్రబాబు తాజాగా ప్రకటించిన ర్యాంకులు జిల్లాలో ఇప్పటికే రెండు వర్గాల్లో ఉన్న తెదేపాను ఏ తీరానికి చేరుస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.