విశాఖ

వారంలో రెండు రోజులు స్వర్ణపుష్పార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మే 2, శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో ఇక నుండి వారంలో రెండు రోజులు స్వర్ణపుష్పార్చన చేయనున్నట్లు దేవస్థానం అధికారులు నేడొక ప్రకటనలో తెలియజేసారు. ప్రస్తుతం ప్రతి గురువారం ఉదయం స్వామివారికి స్వర్ణపుష్పార్చన ఆర్జిత సేవ జరుగుతున్న విషయం తెలిసింది. ఇక పై ఆదివారం కూడా స్వర్ణపుష్పార్చన ఆర్జిత సేవగా జరిపించనున్నట్లు అధికారులు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం నిర్వహిస్తున్న స్వర్ణపుష్పార్చనకు భక్తుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోందని ఈ నేపథ్యంలో దేవాలయంలో స్థలాభావం వలన ఎక్కువ మంది భక్తులకు స్వర్ణపుష్పార్చన చేయించుకొనే అవకాశం లేకుండా పోతోందని అధికారులు తెలిపారు. భక్తుల కోరిక మేరకు వారంలో రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. వెయ్యి నూట పదహారు రూపాయల టిక్కెట్టు పై నిర్వహిస్తున్న స్వర్ణపుష్పార్చన ఆర్జిత సేవకు భవిష్యత్తులో మరింత ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు.
* సంప్రదాయ వస్త్రాలను
తప్పనిసరి చేస్తే బాగుంటుంది
సింహాచలేశుని దర్శనార్ధం వచ్చే భక్తులు తిరుమల తరహాలో సంప్రదాయ వస్త్రాలతో వచ్చేలే త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఇటీవల మానవ వనరుల అభివృద్ధిశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పన్న భక్తులకు నెమ్మదినెమ్మదిగా సంప్రదాయ వస్త్రాలను అలవాటు చేయడానికి దేవస్థానం అధికారులు ఒక ప్రణాళికను రచించుకోవలసి ఉంది. ప్రాథమికంగా స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలతోనే వచ్చేలా చర్యలు తీసుకోవాలి. దేవాలయంలో జరుగుతున్న స్వర్ణపుష్పార్చన, నిత్యకల్యాణం, స్వాతీ నక్షత్ర హోమం, లక్ష తులసి పూజా, లక్ష కుంకుమార్చన, లక్ష్మీనారాయణ వ్రతాలు వంటి ఆర్జిత సేవలకు సంప్రదాయ వస్త్రాలు తప్పనిసరి చేయాలి. ఈ పద్దతిని నెమ్మదిగా భక్తులకు అలవాటు చేసి అనంతరం అంతరాలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తుడు సంప్రదాయ వస్త్రాలు ధరించాలని నిబంధన పెడితే బాగుంటుంది. ఇలా చేయడం వలన భక్తుల్లో పవిత్రమైన భావన పెరగడంతో పాటు దేవాలయ సంప్రదాయం పదికాలాల పాటు నిలబడుతుందని సంప్రదాయ పరిరక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
* స్వర్ణ సంపెంగల విశిష్టత
చందనాచ్ఛ్ధాతుడైన సింహాద్రినాధునికి సంపెంగలంటే ఎంతో ప్రీతి. శ్రీచందనమన్నా, సంపెంగలన్న మక్కువతో ఉండే సింహాచలేశుడికి చాలా సంవత్సరాల కిందట ఓ భక్తుడు స్వర్ణ సంపెంగ పుష్పాలను కానుకగా సమర్పించాడు. సింహాచలం నుండే సంపెంగలను అమెరికా తీసుకువెళ్ళి అక్కడ ఈ సంపెంగలకు బంగారు తాపడం చేయించి అతి భద్రంగా సింహాచలం తీసుకు వచ్చి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజియర్‌స్వామి వారి చేతుల మీదుగా నరహరికి సమర్పించారు. సింహాద్రి నాధుని అష్టోత్తర శతనామాలకు ప్రతీకగా 108 బంగారు పుష్పాలను భక్తుడు సమర్పించారు.
ఈ స్వర్ణ సంపెంగలు కొంత కాలం పాటు బ్యాంకు ఖజానాలోనే ఉండేవి. స్వామివారికి ఎంతో ఇష్టమైన స్వర్ణ సంపెగలతో అర్చన చేయించాలని అధికారులు, వైదికులు నిర్ణయించి స్వర్ణపుష్పార్చన పేరుతో ఆర్జిత సేవను ప్రవేశపెట్టారు. తొలి నాళ్ళల్లో స్వర్ణపుష్పార్చనకు 5000 వేల రూపాయల టిక్కెట్టు నిర్ణయించారు. టిక్కెట్టు ధర భారమైపోవడంతో భక్తులెవరూ ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో టిక్కెట్టును 2500 రూపాయలకి దగ్గించారు. అప్పటికీ ఆశించిన ఆదరణ రాలేదు. దీంతో వెయ్యి నూట పదహారు రూపాయల టిక్కెట్టును ఖరారు చేసారు. ఈ ధర అందరికీ అందుబాటులో ఉండడంతో భక్తులు ప్రతీ వారం పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణపుష్పార్చణ చేయించుకుంటున్నారు.