బిజినెస్

మత్స్య సంపదను మింగేస్తున్న కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూర్పుతీరంలో తిష్టవేసిన అనేక ఫార్మా సంస్థలు ౄ వ్యర్థ జలాలన్నీ సముద్రంలోకే
చోద్యం చూస్తున్న సిఎంఎఫ్‌ఆర్‌ఐ, ఎంపెడా, మత్స్య శాఖలు ౄ పెద్ద ఎత్తున చనిపోతున్న చేపలు
అంధకారంలో మత్స్య పరిశ్రమ ౄ కోట్లాది రూపాయల ఆదాయానికి గండి
ఉపాధి కోల్పోతున్న మత్స్యకార కుటుంబాలు ౄ నాణ్యత లోపం కారణంగా ఎగుమతులకు దెబ్బ

విశాఖపట్నం, మే 8: ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద సముద్రతీరం ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఆ తీరంలోనే కోట్లాది రూపాయల విలువైన మత్స్య సంపద ఏమైందన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ మత్స్య సంపదపైనే లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వీటిని ఎగుమతి చేయడం ద్వారా కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం కూడా ప్రభుత్వ ఖజానాకు లభిస్తోంది. ఇంతటి విలువైన సంపదను మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలుష్యం కారణంగా కోల్పోతోంది. దీంతో సమీప భవిష్యత్‌లో నవ్యాంధ్ర మత్స్య పరిశ్రమకు గడ్డు రోజులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మత్స్య సంపదను పెంపొందించేందుకు చేయూత ఇవ్వాల్సిన సిఎంఎఫ్‌ఆర్‌ఐ, ఎంపెడా, మత్స్య శాఖలు వౌనం వహించడంతో టన్నులకొద్దీ చేపలు కాలుష్యం బారిన పడి చచ్చిపోయి, సముద్ర జలాలపై తేలియాడుతున్నాయి.
కాలుష్యాన్ని నిలువరించలేని పరిస్థితి
శ్రీకాకుళం నుంచి వాడరేవు వరకూ ఉన్న సముద్రతీరాన్ని ఆనుకుని అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇవి నిత్యం విష పదార్థాలను బయటకు వదులుతున్నాయి. వీటిద్వారా వచ్చే వ్యర్థ జలాలు సముద్రంలో కలిసిపోవడంతో మత్స్య సంపద నాశనమైపోతోంది. కళ్లకు కనిపించే ఈ పరిస్థితిని కూడా అధికారులు అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఫలితంగా కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపదను కోల్పోవాల్సి వస్తోంది. ఖజానాకు భారీగా ఆదాయం తగ్గిపోతోంది. అయనా మత్స్యకార అనుబంధ సంస్థలు నోరు మెదపడం లేదు. శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, వాడరేవు, నిజాంపట్నం తదితర ప్రాంతాల్లో ఉన్న సముద్రతీరంలో అతి విలువైన మత్స్య సంపద ఉంది. వీటిలో చందువ, బ్లాక్, వైట్, పింక్, టైగర్ రొయ్యలు, వంజరం, కోనాం, ప్రాన్ వంటి ఖరీదైన చేపలు లభిస్తాయ. కానీ గత రెండు సంవత్సరాలుగా ఇవి మచ్చుకైనా ఈ తీరంలో కనిపించడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్ర జలాల్లో కాలుష్యం పెరిగిపోవడంతో ఇటువంటి విలువైన చేపలు, రొయ్యలు చనిపోతున్నాయి. టైగర్ రొయ్య దొరికితే మత్స్యకారుల పంట పండినట్టే. ఇది కిలో 1,100 రూపాయల ధర పలుకుతుంది మరి. అలాగే వైట్ రొయ్యల కిలో ధర 500 రూపాయలు. గత రెండేళ్ల నుంచి ఈ చేపలు దొరకడం లేదు. ఇవన్నీ వేరే ప్రాంతానికి వలస వెళ్లినట్టు కూడా చెబుతున్నారు. ఇప్పుడు ఈ తీరంలో కేవలం కానుగుంటలు, గులివిందలు, మెత్తని తారలు, పింక్ రొయ్యలు మాత్రమే లభిస్తున్నాయి. ఇవి కిలో 300 రూపాయలకు మించి ధర పలకడం లేదు. మరోవైపు నాణ్యత లోపం కారణంగా ఎగుమతులూ పడిపోతున్నాయ.
కిలోమీటర్ల దూరం వెళ్తేనే చేపలు
రెండేళ్ల కిందట విశాఖ తీరం నుంచి వేటకు వెళ్లిన ఒక బోటు నాలుగు, ఐదు గంటలు ప్రయాణం చేస్తే, మత్స్య సంపద పుష్కలంగా కనిపించేది. కానీ ఇప్పుడు 26 నుంచి 30 గంటలు వేట సాగిస్తే కానీ, చేపల జాడ కనిపించడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో నాలుగు రోజులు వేట సాగిస్తే, 400 కిలోల బరువైన వివిధ రకాల చేపలు, రొయ్యలు దొరికేవి. ప్రస్తుతం 15 రోజులు వేటాడినా 300 కిలోలకు మించి చేపలు లభ్యం కావడం లేదని వారు వాపోతున్నారు. మునుపు మూడు గంటలపాటు వల వేస్తే నిండా చేపలు, రొయ్యలు దొరికేవి. నేడు 10 నుంచి 15 గంపల చేపలు మాత్రమే దొరుకుతున్నాయి. మూడు గంటలపాటు వేట సాగిస్తే, 2,500 రూపాయల డీజిల్ ఖర్చవుతుంది. ఇతరత్రా ఖర్చులన్నింటినీ కలుపుకొంటే 5,000 రూపాయలకు చేరుకుంటోంది. కానీ గరిష్ఠంగా మూడు వేల రూపాయల విలువైన చేపలు మాత్రమే వలకు చిక్కుతున్నాయి.
పెట్టిన పెట్టుబడులూ రావడం లేదు
ఒక బోటు 15 రోజులు వేటకు వెళితే ఆయిల్, ఐస్, సిబ్బంది ఆహారం కోసం రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. వేటలో దొరికిన మత్స్య సంపద విలువలో 10 శాతం మొత్తాన్ని బోటు సిబ్బందికి ఇవ్వాలి, బేటాల కింద మరో ఐదు వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడి కూడా తిరిగి రాని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకూ జరిగిన వేటను పరిశీలిస్తే, ఒక్కో బోటు యజమాని ప్రతి వేటలోనూ 50 నుంచి 70 వేల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి మరి కొంతకాలం కొనసాగితే, వేట నిలిపివేయాల్సి వస్తుందని డాల్ఫిన్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ చెప్పారు. ఇక్కడ వేట సాగకపోవడంతో ఏపికి చెందిన మత్స్యకారులు ఒడిశాకు వెళితే, అక్కడ మత్స్యకారులు మనల్ని వెనక్కు పంపేస్తున్నారని ఆయన చెప్పారు. అటు ఒడిశా, ఇటు చెన్నైకి వెళ్లకుండా ఏపి తీరంలోనే వేట సాగించడం కన్నా, వ్యాపారాన్ని వదులుకోవడమే మేలని ఆయన చెప్పారు. మొత్తానికి ఔషధరంగ సంస్థల కాలుష్య కాటుకు విలువైన మత్స్య సంపద కుదేలైపోతోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా జోక్యం చేసుకోకపోతే మత్స్యకారుల జీవితాలు రోడ్డునపడటం ఖాయమన్న ఆందోళనలు పెద్దగానే వినిపిస్తున్నాయ.

సముద్ర జలాల్లోకి విడుదలవుతున్న కాలుష్యపు నీరు, బోటు నుంచి చేపల కోసం వల వేస్తున్న మత్స్యకారులు