విశాఖపట్నం

సమస్యలపై వినతుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 12: స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ రైల్వేస్టేషన్‌లో వసతులు మరింతగా మెరుగుపర్చాలని, అలాగే మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతూ విశాఖ, అనకాపల్లి ఎంపీలు డాక్టర్ కంభంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు రైల్వేబోర్డు చైర్మన్ ఏకె మిట్టల్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాలను వేర్వేరుగా అందజేశారు. అనకాపల్లి, దువ్వాడ రైల్వేస్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యల గురించి శ్రీనివాసరావు, అలాగే విశాఖ రైల్వేస్టేషన్ స్థాయి పెరిగినందున దీనికనుగుణంగా మరిన్ని కొత్త రైళ్ళు, అదనపు కోచ్‌లు, ప్రయాణికుల వసతులు పెంచాల్సి ఉందని విశాఖ ఎంపీ హరిబాబు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళారు.
* శ్రామిక్ కాంగ్రెస్ వినతి...
దేశంలో అతి ముఖ్యమైన ప్రాధాన్యత కలిగి ఉండే విశాఖ డీజిల్‌లోకోషెడ్‌లో వంద లోకోలను నిర్వహిస్తున్నారని, దీనికనుగుణంగా పోస్టుల భర్తీ జరగడంలేదని ఈస్ట్‌కోస్ట్‌రైల్వేశ్రామిక్ కాంగ్రెస్ ప్రతినిధులు చైర్మన్ మిట్టల్‌కు వివరించారు. కనీసం ఇక్కడ 200 పోస్టులనైనా భర్తీ చేయాల్సి ఉందని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే ఎలక్ట్రికల్ లోకోషెడ్‌లో పనిభారం పెరిగిందని, ఏఎస్‌ఎంలు, గ్రూడ్ డి క్యాడర్‌లో పోస్టుల మంజూరు లేదని, రన్నింగ్ స్ట్ఫా సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరారు. గత పదేళ్ళుగా పెరుగుతున్న రైళ్ళ సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడంలేదన్నారు. రైల్వే కార్మికుల నివాసిత కాలనీల్లో నెలకొన్న సమస్యలు తీర్చేవిధంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. చైర్మన్‌ను కలిసిన వారిలో కేంద్ర నాయకులు తమ్మినేని నరసింగరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఆర్ 1: రైల్వేబోర్డు చైర్మన్ మిట్టల్‌ను సత్కరిస్తున్న శ్రామిక్ కాంగ్రెస్ ప్రతినిధులు
* వారణాసి-విశాఖ మధ్య రెగ్యుల్ రైలు నడపాలి
భక్తుల తాకిడి అధికంగా ఉండే వారణాసి, షిరిడి యాత్రిగుల సౌకర్యార్ధం విశాఖ నుండి రెగ్యులర్ రైలు నిర్వహించాలని రైల్వేబోర్డు చైర్మన్ ఏకె మిట్టల్‌ను ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోనల్ యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు ధర్మాల ఆనంద్‌కుమార్‌రెడ్డి కోరారు. రైల్వే అభివృద్ధ కార్యక్రమాలు ఏర్పాట్ల పర్యవేక్షణల భాగంగా విశాఖ నగరానికి విచ్చేసిన సందర్భంగా రైల్వేబోర్డు చైర్మన్‌ను ఆయన శుక్రవారం మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సత్కరించి అనంతరం ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు లక్షలాది సంఖ్యతో భక్తులు ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలైన షిరిడి, వారణాసిని దర్శించుకోవడానికి పూర్తిస్థాయి రైలు సౌకర్యం లేక యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. విశాఖ నుండి వారణాసి రెగ్యులర్ రైలును ప్రవేశపెట్టాలని కోరడంతో రైల్వేబోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారన్నారు. జెడ్‌ఆర్‌యుసిసి సభ్యులు జి.ప్రభాకర్‌చౌదరి పాల్గొన్నారు.