విశాఖ

పెట్రోలు బంకుల్లో దోపిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 12: పెట్రోలు బంకుల్లో తెలియని దోపిడి జరిగిపోతోంది. అర్థరాత్రి సమయంలో నగరంలోని పెట్రోలు బంకుల సిబ్బంది పాల్పడుతున్న అక్రమాలతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ మారుతున్న విషయం తెలిసిందే. వీటిని అడ్డం పెట్టుకుని పెట్రోలు బంకుల సిబ్బంది చేతివాటం చాలా దారుణంగా ఉంది. మారిన పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతి రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. మారిన ధరలు ఆన్‌లైన్‌లోనే ఆయా బంకుల వద్ద పంపుల్లోకి నేరుగా వస్తాయి. ఈ ధరల మార్పిడి ప్రక్రియ జరగడానికి కనీసం 10 నిముషాల వ్యవధి పడుతుంది. ఈ సమయంలో పంపులు పనిచేయవు. ఎందుకంటే, ఈనెల ఒకటో తేదీకి ముందు కూడా ప్రతి రోజు అర్థరాత్రి 12 గంటలకు దేశంలోని అన్ని పెట్రోలు బంకుల్లోని పంపులు కాసేపు ఆగిపోతాయి. ఆయా పెట్రోలు కంపెనీలు డేటా తీసుకున్న సేకరించిన తరువాత పంపులు యథావిధిగా పనిచేస్తాయి. ఇప్పుడు కూడా అదే ప్రక్రియ కొనసాగుతుంది. మారిన ధరలను పంపుల్లో ఫీడ్ చేసిన తరువాత పెట్రోలు, డీజిల్ విక్రయాలు ప్రారంభించాలి. సరిగ్గా అర్థరాత్రి 12 నుంచి 12.30 గంటల వరకూ నగరంలోని చాలా బంకుల్లో మారిన ధరలను ఫీడ్ చేయడం లేదు. ఇదే సమయంలో బంకులకు వచ్చే వాహన చోదకులు పెట్రోలు, డీజిల్ కావాలని కోరితే, కొంత సమయం వేచి ఉండమంటున్నారు. అలా వేచి ఉండే సమయం లేని వారికి పెట్రోలు, డీజిల్ విక్రయిస్తున్నారు. మారిన ధర ఎంత ఉంటుందో మాకు తెలియదు. అందుకని వందకు పది రూపాయలు మినహాయించుకుంటాం. అని సిబ్బంది చెపుతున్నారు. వాహన చోదకులు చేసేది లేక, వందకు పది రూపాయల చొప్పన వదులుకుని, 90 రూపాయలకే పెట్రోలు, డీజిల్ పోయించుకుని వెళుతున్నారు. ఇలా బంకుల్లో సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా డబ్బులు దండుకుంటున్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మహానాడుకు ఆహ్వానితులు వీరే!

విశాఖపట్నం, మే 12: ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు ఎయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఆహ్వానించేవారి జాబితాను పార్టీ కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, 2014లో పోటీ చేసి ఓడిపోయిన వారు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, కో-ఆర్డినేటర్లు, త్రిసభ్య కమిటీ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వరంగ, కార్పొరేషన్ చైర్మన్లు, టిటిడి బోర్డు సభ్యులు, జెడ్‌పి చైర్మన్‌లు, వైస్ చైర్మన్లు ఉన్నారు. అలాగే, పార్లమెంట్ మాజీ సభ్యులు, శాసనసభ మాజీ సభ్యులు, శాసనమండలి మాజీ సభ్యులు, రాష్టప్రార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యవర్గం, జిల్లా పార్టీ కార్యవర్గం, మండల, పట్టణ, కార్పొరేషన్ డివిజన్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, డెయిరీ చైర్మన్లు ఉన్నారు. అదేవిధంగా 2014 మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన మేయర్లు, డిప్యూటి మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన డివిజన్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, నీటి సంఘాల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, నగర మాజీ మేయర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర మాజీ కమిటీ సభ్యులు, జిల్లాపరిషత్ మాజీ చైర్మన్లు, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు, వక్ఫ్‌బోర్డు చైర్మన్లు, సుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్లు తదితరులు ఉన్నారు.
కోస్ట్‌గార్డ్‌ను సందర్శించిన వినోద్ కుమార్

విశాఖపట్నం, మే 12: సీనియర్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (ఐడిఎఎస్) ఆఫీసర్ వినోద్‌కుమార్ విజయ్ శుక్రవారం విశాఖలోని కోస్ట్‌గార్డ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కోస్ట్‌గార్డ్ నౌకలను సందర్శించారు. కోస్ట్‌గార్డు నౌకలు సాగర్, విగ్రహ, సముద్ర నౌకలను ఆయన పరిశీలించారు. ఈ నౌకల రీ ఫిట్ గురించి, సమాచారాన్ని ఆయన తెలుసుకున్నారు. వినోద్ కుమార్‌కు కోస్ట్‌గార్డ్ డిఐజి ఎకె హర్బోలా ఘన స్వాగతం పలికారు.