విశాఖపట్నం

విజ్ఞాన రైలు వచ్చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 15: విజ్ఞాన రైలు వచ్చేస్తోంది. వాతావరణంలో మార్పులపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించే ఈ విజ్ఞాన రైలులో పిల్లలు సృజనాత్మకతను పెంపొందించే, మేథస్సు వికసించే విధంగా రూపొందించిన సైన్స్ ఎక్స్‌ప్రెస్ ఈసారి కొత్తవలస రైల్వేస్టేషన్‌కు వస్తుంది. ఇది ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ స్టేషన్‌లో నిలుస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శకులు, పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఇది అందుబాటులోకి ఉంటుంది. వాతావరణంలో నెలకుంటున్న మార్పులపై వైజ్ఞానిక, సాంకేతిక, టెక్నాలజీ,పర్యావరణ,అటవీ,వాతావరణ మంత్రిత్వశాఖ, రైల్వేశాఖ, వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ అండ్ విక్రమ్ ఏ సరభాయి కమ్యూనిటీ సైన్స్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే సైన్స్ ఎక్స్‌ప్రెస్‌లో పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఎగ్జిబిషన్ ఉంటుంది. ‘సైన్స్ ఎక్స్‌ప్రెస్ - క్లైమేట్ యాక్షన్ స్పెషల్ (ఎస్‌ఇసిఏఎస్) అనే అంశంపై సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సందేశాన్ని దీని ద్వారా ఇవ్వనున్నట్టు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (కో-ఆర్డినేటర్) జి.సునీల్‌కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు. సైన్స్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రవేశం ఉచితమేనని దీనిని సందర్శకులు, విద్యార్థులు గమనించి సద్వినియోగపర్చుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజావాణికి 297 దరఖాస్తులు

విశాఖపట్నం, మే 15: సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి తమ వినతులను అధికారులకు సమర్పించారు. సోమవారం కార్యక్రమానికి 297 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ జి.సృజన, జెసి-2 డివి రెడ్డి, జిల్లా రెవెన్యూ అదికారి చంద్రశేఖరరెడ్డి, ప్రజావాణిలో పాల్గొని పలు ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి స్వయంగా వినతులు స్వీకరించారు. గృహాలు, రేషన్‌కార్డులు, భూమి వివాదాలు, పించన్ల మంజూరు ఇతర సమస్యలకు సంబంధించిన విజ్ఞాపనలను సమర్పించారు. మీ కోసం కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డయల్ యువర్ కలెక్టర్‌కు 14 ఫోన్‌కాల్స్

విశాఖపట్నం, మే 15: సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ‘డయల్ యువర్ కలెక్టర్’కు 14 ఫోన్‌కాల్స్ రావడం జరిగింది. ఫిర్యాదుదారులు వివిధ అంశాలపై ఫోన్ చేసి తమ సమస్యలను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు విన్నవించారు. ఫోన్ ద్వారా వచ్చిన పిర్యాదులను సంబంధితాధికారులు వెంటనే పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి.సృజన, జెసి-2 డివి రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.