విశాఖ

జల్సా రాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), మే 15: రాష్ట్రంలో కలకలం సృష్టించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హవాలా కేసులోని ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ మొదటి నుండి జల్సారాయుడేనని పోలీసులంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటూ ఇంటర్ వరకు చదువుకున్న మహేష్ తర్వాత దూర విద్య ద్వార డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు చేసే చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారాలను దగ్గర నుండి గమనించిన మహేష్ సులువుగా డబ్బులు సంపాదించడానికి తన తెలివితేటలను ఉపయోగించాడు. దీంతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి మహేష్ అవలంబించిన పద్దతులు నల్ల కుభేరులను ఆకర్షించింది. కమీషన్ పద్దతిలో బ్యాంక్‌లలో నల్లధనాన్ని డిపాజిట్ చేసి, అనంతరం ఇతర దేశాలలలోని బ్యాంక్‌లకు పంపించడంతో అది తెల్లధనంగా మారిపోయింది. ఇందుకు గాను కోట్లాది రూపాయులు మహేష్‌కు కమీషన్‌గా వచ్చేది. దీంతో మహేష్ తన 22వ ఏట నుండే విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. కష్టపడకుండ సులువుగా డబ్బులు వస్తుండడంతో వాటిని ఏమి చేయాలో తెలియక విలాసాలకు ఉపయోగించేవాడని పోలీసులు తెలిపారు. మహేష్ సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువ గల బెంజ్ కారులో తిరుగుతూ జల్సా చేసేవాడు. అదే విధంగా తండ్రి సుమారు రూ.20లక్షల విలువ గల ఫార్చున్ కారును ఉపయోగించేవాడు. అయితే పట్టుబడ్డ తండ్రి శ్రీనివాసరావు, తన కుమారుని ఆర్థిక నేరాలతో తనకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం. ఈ కేసులోని నిందితులకు ఒక్కోక్కరికి రెండేసి, మూడేసి పాన్ కార్డులు ఏ విధంగా వచ్చేయో అన్నది అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రధాన నిందితుడు మహేష్ 2014వ సంవత్సరం నుండి హవాలా వ్యవహారం నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అప్పుడు మహేష్ వయస్సు కేవలం 22సంవత్సరాలు.
ఇంత చిన్న వయస్సు ఉన్న యువకుడు అంత పెద్ద ఆర్థిక నేరాలను గత రెండేళ్లుగా చేస్తున్న బ్యాంక్ అధికారులు గాని, ఇతర అధికారులు గాని ఇంత వరకు గుర్తించకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఖరీధైన బెంజ్ కారును ఉపయోగించడం, అదే సమయంలో కోలకత్తాలో రూ.92కోట్ల నగదును అక్కడి బ్యాంక్‌లో నేరుగా డిపాజిట్ చేయడంతో ఒక్కసారిగా ఐటి శాఖాధికారుల దృష్టి దీనిపై పడింది. సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా నగదును బోగస్ కంపెనీల పేరుతో తెల్లధనంగా మార్చడానికి మహేష్ వివిధ బ్యాంక్‌లలో డిపాజిట్ చేసి, అనంతరం వచ్చిన నగదులో రూ.కోట్లలను కమీషన్‌గా తీసుకోవడం వంటి విషయాలను గమనించిన ఐటి అధికారులు ఒక్కసారిగా నివ్వెర పోయారు.
* పిటి వారెంట్ వేయనున్న సిఐడి అధికారులు
ఇదిలా ఉండగా ఈ కేసును పోలీసు కమిషనర్ టి.యోగానంద్, సిఐడికి అప్పగించాల్సిందిగా డిజిపి సాంబశివరావును కోరడంతో, సిఐడికి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో కేసును పూర్తిస్థాయిలో పరిశీలించడానికి సిఐడి ఐజి అమిత్‌గార్గ్ సోమవారం ఉదయం నగరానికి చేరుకున్నారు. ఈ తరుణంలో అరెస్టు అయి రిమాండ్‌కు తరలించిన వడ్డీ మహేష్‌ను తిరిగి సిఐడి అదికారులు విచారించనున్నారు. ఇందుకు గాను బహుశ మంగళవారం సిఐడి ప్రత్యేక న్యాయస్థానంలో మహేష్‌ను జ్యూడిషీయల్ కస్టడీకి తీసుకుని, విచారించడానికి పిటి వారెంట్‌ను వేయనున్నట్టు తెలిసింది. గతంలో దేశంలో సంచలనం సృష్టించిన పనామా కేసులో నిందితులు తప్పించుకున్నట్టు, ఈ కేసులోని నిందితులు తప్పించుకుంటారో లేక కోర్టు వీరికి ఆర్థిక నేరాలకు సంబంధించి శిక్షలు వేస్తుందో వేచి చూడాల్సిందే.