విశాఖపట్నం

సబ్బవరంలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, జూన్ 14: మండలంలో బుధవారం 11.6 మిల్లీమీటర్లు( 11సెంటీమీటర్లు) భారీ వర్షం కురిసింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వర్షం ఎడ తెరిపిలేకుండా కుండపోతగా కురవటంతో పల్లపు ప్రాంతాలు జలమయ మయ్యాయి. మండలంలోపలు గ్రామాల్లో వాగులు, వొంకలు, పొంగి ప్రవహించాయి. సాగునీటి చెరువుల్లో పెద్దఎత్తున నీరు చేరింది. సబ్బవరం- అనకాపల్లి రోడ్డులో అసకపల్లి ఎస్సీకాలనీ వద్ద భారీ వృక్షం కూలిపోవటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీన్ని పోలీసుల సహాయంతో తొలగించారు. అంతేకాకుండా పైడివాడ - పెదగొల్లలపాలెం మధ్యగల గెడ్డపై వంతెన నిర్మించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ రోడ్లుభవనాలశాఖ అధికారులు మళ్ళీ సిమెంటు ర్యాంప్ నే మరమ్మతులు చేయటంతో అక్కడ గెడ్డనుంచి ప్రవహించే వర్షపునీరు రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈవర్షం ఖరీఫ్ వరి నారుమడుల తయారీకి, గంటి (సజ్జ) నాట్లు వేసేందుకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
బురద మయంగా వర్శిటీ రోడ్డు
భారీ వర్షాలకు అసకపల్లి పంచాయతీ పరిధిలోని దామోదర సంజీవయ్య నేషనల్ లా-యూనివర్శిటీ రోడ్డు బురద మయంగా మారింది. దీంతో అసలే మట్టిరోడ్డు అందులో వర్షాలకు బాగా దెబ్బతినటంతో వర్సిటీకి వచ్చే విద్యార్థులు, ఆచార్యులు అవస్థలు ఎదుర్కొన్నారు.
ఈనేపధ్యంలో బుధవారం ఇక్కడి యూనివర్శిటీని సందర్శించిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్ చక్రపాణి, రాష్ట్ర న్యాయశాఖా మంత్రి కొల్లురవీంద్రలు ఈరోడ్డు మీదుగానే ప్రయాణించాల్సి వచ్చింది. అయితే ఇక్కడి యూనివర్శిటీలోగల మెయిన్ గేటు వరకు అధికారులు నిర్మించతలపెట్టిన 80 అడుగులరోడ్డు నిర్మాణానికి గాను అవసరమైన స్థలానికి రైతులు అడ్డుచెప్పటంతో నిర్మాణం ఆగిపోయిన సంగతి తెల్సిందే.
సబ్బవరం-చోడవరం రోడ్డునుంచి గొటివాడ జంక్షన్ నుంచి యూనివర్శిటీ క్యాంపస్‌లోకి రోడ్డునిర్మించాల్సి ఉంది. ఈసమస్య పరిష్కారం కావాలంటే వుడా అధికారులతోపాటు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.

త్వరలో అన్న అమృత హస్తం, బాలామృతం

విశాఖపట్నం, జూన్ 14: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అన్న అన్న అమృత హస్తం, బాలామృతం పథకాలను ప్రారంభించనుందని స్ర్తి,శిశు సంక్షేమ శాఖ పరటాల సునీత స్పష్టం చేశారు. స్ర్తి,శిశు సంక్షేమ శాఖ అధికారులతో జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు సక్రమంగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, ఈ అపప్రదను తొలగించే విధంగా సిబ్బంది పనిచేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్ఠికాహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. అయితే గుడ్లు పంపిణీ చేసే కాంట్రాక్టర్ సక్రమంగా పనిచేయట్లేదన్నారు. గుడ్లు పంపిణీలో ఫిర్యాదులు ఎదురైతే సంబంధిత కాంట్రాక్టర్‌ను బాధ్యులుగా చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతలో తల్లీ,బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. మాతా,శిశు మరణాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్, పట్టణాల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లకు నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ కళాశాల ఉపాధ్యాయులతో బోధనపై శిక్షణ ఇప్పించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది బాలలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆసరా పొందుతున్నారన్నారు. సిడిపిఓలు తాము చేస్తున్న రోజువారీ పనులు, తదితర అంశాలకు సంబంధించి రిజిస్టర్లు నిర్వహించాలని సూచించారు. పౌష్టికాహారం తీసుకునే విషయంలో గర్భిణులు, బాలింతలకు సిబ్బంది తగిన సలహాలు, సూచనలు ఇచ్చి వారికి అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేనిపక్షంలో సంబంధిత తహశీల్దార్లను కలిసి ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగాయని, మహిళలు, స్ర్తిలను కించపరిచే విధంగా నేరాలకు పాల్పడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టివి సీరియల్స్‌లో మహిళను కించపరిచే కార్యక్రమాల ప్రసారలు పెరిగిపోయాయని, దీన్ని నియంత్రించాల్సి ఉందన్నారు. బాల్య వివాహాలకు అడ్డుకట్టవేసేందుకు యంత్రాంగం పనిచేయాలన్నారు. మహిళా,శిశు సంక్షేమ శాఖ డిపి చిన్మరుూదేవి మాట్లాడుతూ జిల్లాలో 3,78,812 మంది గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, ఐదేళ్లలోపు పిల్లలందరికీ ప్రతి నెలా క్రమం తప్పకుండా పౌష్ఠికాహారం అందిస్తున్నామన్నారు. అన్న అమృత హస్తం ద్వారా 25వేల మంది మహిళలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా, మరో 33 వేల మందికి బియ్యం, పప్పు, నూనె సామాగ్రి ఇంటికే పంపుతూ పౌష్ఠికాహారం అందిస్తున్నామన్నారు. గిరిగోరుముద్దలు కార్యక్రమంలో భాగంగా బాలలకు అన్నం, గుడ్లు, పాలు ఇస్తున్నామన్నారు. జిల్లాలో 691 అంగన్‌వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దామన్నారు. జిల్లా కేంద్రంలో వన్ స్టాప్ సెంటర్ (సఖీ) కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధిత మహిళలకు న్యాయ,వైద్య,పోలీసు సేవలందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ, ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.