విశాఖ

రోగులతో కిటకిటలాడుతున్న ఏరియా ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూన్ 16: స్థానిక వైద్య విదాన పరిషత్ ఏరియా ఆసుపత్రిలో రోగులతో కిటకిటలాడుతుంది. పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారంతా ప్రతీ రోజు ఆసుపత్రిలో చికిత్స కోసం క్యూ కడుతున్నారు. గ్రామాలలో వ్యాధులు ప్రబలడంతో ఇంటికి ఒకరు వంతున వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులు ఏరియా ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. వారం రోజులుగా గ్రామాలలో జ్వరాల తీవ్రత పెరగడంతో ఆసుపత్రిలో రోగుల సంఖ్య అధిక సంఖ్యలో నమోదవుతుంది. వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య రోజుకు వంద నుంచి 150 వరకు ఉంటుందని చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో గ్రామాలలో వ్యాధులు విజృంభిస్తుండడం వలన గిరిజనులు మలేరియా, జ్వరాల బారిన పడి మంచం పడుతున్నారు. గ్రామాలలో వైద్య సిబ్బంది ప్రాధమిక వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వ్యాధులు తగ్గుముఖం పట్టకపోవడంతో అరకులోయ ఏరియా ఆసుపత్రికి రాక తప్పడం లేదని పలువురు గిరిజనులు చెబుతున్నారు. దీంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో దినదినానికి రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రానున్న రోజుల్లో వర్షాలు మరింత పెరిగితే వ్యాధులు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. వర్షాల కారణంగా వ్యాధుల తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాలలో వైద్య శిబిరాలను నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
రేషనలైజేషన్ నుంచి ఏజెన్సీకి మినహాయింపు ఇవ్వాలి
పాడేరు, జూన్ 16: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో రేషనలైజేషన్ నుంచి విశాఖ గిరిజన ప్రాంతానికి మినహయింపు కల్పించాలని గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కుడుముల కాంతారావు కోరారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మైదాన ప్రాంతం కంటే గిరిజన ప్రాంతం భౌగోళికంగా విభిన్నంగా ఉండడమే కాకుండా కొండలు, వాగులు అధికంగా ఉన్నాయని అన్నారు. దీంతో పది మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఎత్తివేసి పక్క గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేయడం వలన గిరిజన చిన్నారులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. పక్క గ్రామాల పాఠశాలలకు వెళ్లాలంటే కొండలు, వాగులు దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుండడంతో చిన్న పిల్లలు తమ గ్రామాల నుంచి పక్క గ్రామాల పాఠశాలకు వెళ్లడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. దీంతో పాఠశాలకు వెళ్లకుండా డ్రాప్ అట్స్‌గా మిగిలిపోతున్నారని ఆయన అన్నారు. గత సంవత్సరం నిర్వహించిన రేషనలైజేషన్‌లో ఏజెన్సీలోని అనేక పాఠశాలలను మూసి వేయడం వలన ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పక్క గ్రామాలకు వెళ్లలేక మధ్యలోనే బడి మానేసిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని ఆయన అన్నారు.