విశాఖపట్నం

రాజయోగాలో ఉచిత శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 20: ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజయోగలో ఉచిత శిక్షణ ఇస్తామని ప్రజాపతి బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం హెచ్‌బి కాలనీ శాఖ ప్రతినిది రామేశ్వరి వెల్లడించారు. డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం జరుగుతుందన్నారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు నగరంలో ఉన్న బ్రహ్మకుమారీ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు శిక్షణా తరగతులు జరుగుతాయన్నారు. కలక్టరేట్, బురుజుపేట, రైల్వేన్యూకాలనీ, శాంతిపురం ప్రాంతాల్లోని ప్రధాన కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో గల బ్రాంచి కార్యాలయాల్లో ఈ తరగతులు జరుగుతాయన్నారు. కలియుగంలో మానవులు పలు రకాల శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని ఆందోళన గంటల వరకు శిక్షణ వ్యక్తంచేశారు. ఆధునిక వైద్యశాస్త్రం వల్ల నయం కాని రోగాలు సైతం యోగాతో నయం అవుతున్నాయని గుర్తుచేశారు. విద్యార్థులు, గృహిణులు, వ్యాపారులు, అన్ని వయస్సులు, అన్నివరాగల వారు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని ఆథ్యాత్మిక కేంద్రంగా చూస్తున్నాయన్నరు. ఈ సమావేశంలో బ్రహ్మకుమారీ సంస్థ ప్రతినిధులు సత్యవతి, అరుణ్, హనుమ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పద్మనాభంలో పిడుగుపాటు
* భారీగా టివీలు, ఫ్యాన్లు ధ్వంసం
* స్థానికుల ఆందోళన
పద్మనాభం, జూన్ 20: మండలంలో కృష్ణాపురం, అర్చకులపాలెం, పద్మనాభం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం పడిన పిడుగులకు టివీలు, ఫ్యాన్లు, ఇళ్ళల్లో ఉండే వైరింగ్‌లు ధ్వంసమయ్యాయి. కృష్ణాపురంలో సుమారు 50 టివీలు, 30 ఫ్యాన్లు, పద్మనాభంలో 15 టివీలు పది ఫ్యాన్లు అర్చకులపాలెంలో పది టివీలు, 15 ఫ్యాన్లు కాలిపోయినట్టు సర్పంచ్‌లు తెలిపారు. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో పిడుగులు పడటంతో ఆయా ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. ఇటువంటి పరిస్థితులు గతంలో ఎపుడూ లేవని స్థానికులు అంటున్నారు.