విశాఖపట్నం

సిబిఐ విచారణ జరిపితేనే నిజాలు బహిర్గతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 20: విశాఖ ఖ్యాతిని మంటగలిపేలా జరుగుతున్న భూ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలని పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల భూములు కబ్జాకు గురవుతున్నాయని, సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇదే విషయాన్ని లేవనెత్తారని పేర్కొన్నారు. భూ కుంభకోణాల్లో అధికార పార్టీ నేతల పేర్లు వెలుగులోకి వస్తుండగా ప్రభుత్వం మాత్రం విషయాన్ని సాధారణంగా తీసుకుంటోందని విమర్శించారు. భూ కుంభకోణాలపై సిట్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం దోషులను రక్షించే యత్నం చేస్తోందని ఆరోపించారు. పరోక్షంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సిబిఐ లేదా సిబిసిఐడి విచారణ కోరగా ప్రభుత్వం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటన్నారు. సిబిఐ విచారణకు ఆదేశించడంతో పాటు మంత్రులిద్దర్నీ విచారించాలని సూచించారు. విశాఖ భూ కుంభకోణంపై రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి స్పందిస్తూ ఈ నెల 15న బహిరంగ విచారణ చేయనున్నట్టు ప్రకటించారని, అయితే అనూహ్యంగా ప్రభుత్వం సిట్ విచారణను తెరపైకి తీసుకువచ్చి సమస్యను చల్లార్చే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. బహిరంగ విచారణ జరిపితే బాధితులు తమ గోడు వెళ్లబోసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే అధికార టిడిపి మిత్ర పక్షంగా వ్యవహరిస్తున్న బిజెపి నేత విష్ణుకుమార్ రాజు సైతం అధికార పార్టీ భూకుంభకోణాలపై పలు అంశాలను లేవనెత్తారని గుర్తు చేశారు. విచారణ సందర్భంగా ఆయన అభిప్రాయాలు కూడా తీసుకోవాలన్నారు. భూ కుంభకోణానికి సంబంధించి వారి వద్ద నున్న ఆధారాలు విచారణకు ఎంతో పనికివస్తాయన్నారు. జిల్లాలో జరుగుతున్న భూ కుంభకోణాలపై తీసుకుంటున్న చర్యలు వివరించాల్సిన బాధ్యత యంత్రాగంపై ఉందన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ టిడిపి అధికారం చేపట్టిన మూడేళ్ల కాలంలో విశాఖలో భూ కుంభకోణాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. భూ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ వినతిపత్రాన్ని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, నియోజకవర్గ బాధ్యులు మంత్రి రాజశేఖర్, జగ్గుబిల్లి అప్పలరాజు, సోడాదాసు సుధాకర్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పి సతీష్ వర్మ, నగర కాంగ్రెస్ కార్యదర్శి కె గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అట్టడుగు వర్గాల సంక్షేమమే మోదీ లక్ష్యం
* ఇంటింటికీ బిజెపి కార్యక్రమంలో రఘుబాబు

విశాఖపట్నం, జూన్ 20: అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని బిజెపి రాష్ట్ర మీడియా కమిటీ సభ్యుడు గుండు రఘుబాబు అన్నారు. జివిఎంసి 31వ వార్డు టిఎస్‌ఎన్ కాలనీలో ఇంటింటికీ బిజెపి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని అందుకు అనుగుణంగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే అటల్ పెన్షన్ యోజన, భేటీ బజావ్, భేటీ పడావ్, తదితర పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళలకు మేలు చేసే విధంగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రధాని మోదీ ప్రజలందరి మన్ననలు పొందుతున్నారన్నారు. దేశ ప్రగతిని అగ్రపథాన నిలుపుతున్న మోదీకి బాసటగా నిలిచేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. బిజెపి నగర ప్రధాన కార్యదర్శి వేదుల దక్షిణామూర్తి, వార్డు అధ్యక్షుడు గురుగోవింద్ సింగ్, కార్యదర్శి పొన్నాడ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సురేంద్రలాల్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.