విశాఖ

ముడసర్లోవ రిజర్వాయర్‌ను సుందరంగా తీర్చిదిద్దండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 27: ముడసర్లోవ రిజర్వాయర్‌ను, పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. ముడసర్లోవ రిజర్వాయర్ అభివృద్ధి పనులపై తన ఛాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. అభివృద్ధి పనుల పేరిట మొక్కలను తొలగించే ప్రయత్నం వద్దన్నారు. అవసరం ఉన్నచోట అదనంగా మొక్కలు నాటాలని సూచించారు. ముడసర్లోవ పార్కులో తగిన ఖాళీ స్థలం ఉందని, మొక్కలు లేని చోట మొక్కలు నాటాలని ఉద్యానవన అధికారి దామోదర్‌ను ఆదేశించారు. జలాశయం, జలాశయం పరిసరాలకు ప్రహారీ నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జలాశయం పరిసరాల్లో విస్తృతంగా ఉన్న అనవసర మొక్కలను తొలగించి, అందమైన, నీడనిచ్చే మొక్కలు నాటాలని సూచించారు. ముడసర్లోవ జలాశయంలో అవసరం మేరకు పూడిక తొలగించే పనులు చేపట్టాలని ఆదేశించారు. నగరానికే తలమానికమైన ముడసర్లోవ పార్కును పర్యావరణ హితమైన పార్కుగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఇప్పటికే చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, ఎపిడిఆర్‌పి, అమృత్ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిఆర్‌టిఎస్ రహదారి కారిడార్లలో అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులను విచారించారు. ప్రాజెక్టులకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తి చేయని పక్షంలో చర్యలు తప్పవని ఇంజనీరింగ్ అధికారులను సున్నితంగా హెచ్చరించారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ ఎన్ దుర్గా ప్రసాద్, సిసిపి విద్యుల్లత, ఎడి దామోదర్, ఎస్‌ఇలు ఆనందరావు, వినయ్‌కుమార్, వెంకటేశ్వరరావు, వేణుగోపాల రావు, ఇఇలు సుధాకర్, పల్లంరాజు, రాంమ్మోహన్, జోన్ 1 కమిషనర్ సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.