విశాఖ

ఏజెన్సీలో ఆరోగ్య పరిస్థితులపై సిఎం ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 27: గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితులపై అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని ఏడు ఐటిడిఎల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధులు నియంత్రించాలని ఆదేశించారు. దీనికి అవసరమైన మెన్, మెటీరియల్ సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటోందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించనున్నట్టు తెలిపారు. అయితే క్షేత్ర స్థాయిలో ఈ పథకాలన్నింటినీ క్రోఢీకరిస్తూ, అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్లే ఏజెన్సీలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఏజెన్సీలో ప్రతి ఏటా ఎదురయ్యే సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ప్రణాళికా బద్దంగా చేపట్టే చర్యలు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉందన్నారు. అయితే ఇంకా కొన్ని చోట్ల పనులు అసంపూర్తిగా ఉండిపోయాని, ఇటువంటి పరిస్థితులు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమా సుందరి, జిల్లా పరిషత్ సిఇఓ జయప్రకాష్ నారాయణ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.