విశాఖ

వచ్చే ఏడాదికల్లా ఏజెన్సీ గ్రామాలకు రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 27: ఉపాధి హామీ పనుల్లో భాగంగా వచ్చే ఏడాది చివరి నాటికి ఏజెన్సీలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధిహామీ, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, పర్యాటక శాఖ పనుల ప్రగతిని మంగళవారం ఆయన సమీక్షించారు. ఏజెన్సీలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, లక్ష్య సాధనకు క్షేత్ర స్థాయిలో అధికారులు కృషి చేయాలన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలు కూడా ఏజెన్సీలో రహదార్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులు విస్తృతంగా చేపట్టడం ద్వారా కూలీలకు వేతనాలు అందేలా చూడాలన్నారు. ప్రతి జిల్లాలోను మినీ స్టేడియంల నిర్మాణాలకు ఉపాధిహామీ నిధులు రూ. కోటి, దీనికి మ్యాచింగ్‌గా శాప్ రూ.కోటి నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. విశాఖ జిల్లాలో నాలుగు మినీ స్టేడియంల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. పంట కుంటల నిర్మాణానికి వ్యక్తిగతంగా ఎవరూ ముందుకు రాని పక్షంలో కమ్యూనిటీ పంట కుంటల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. ఉపాధిహామీ పథకం కింద ఉద్యానవన పంటలు, ఎవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రతి మొక్కకు రూ.25 చెల్లిస్తున్నామన్నారు. ఈ నిధులను వినియోగించి ప్రతి గ్రామంలోను కిలోమీటరు దూరంలో మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలో లక్ష్యంగా నిర్ధేశించిన 15వేల వర్మీ కంపోస్టు యార్డుల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కొండ ప్రాంతాల్లో 205 ఎకరాలను పచ్చదనం పెరిగేలా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మొక్కలు నాటే కుంతలు సరిగా లేకపోవడం వల్ల నాటిన మొక్కలు పోతున్నాయని, నిర్ధేశించిన పరిమాణంలో కుంతలు తీయాలని స్పష్టం చేశారు. ఉపాధిహామీ పథకం కింద మంజూరు చేసిన అంగన్ వాడీ, పంచాయతీ భవనాలు, శ్మశాన వాటికలు, క్రీడా స్థలాల అభివృద్ధి పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షిస్తూ హుద్‌హుద్ ప్రత్యేక హౌసింగ్ కింద చేపట్టిన 5,468 గృహాలను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్‌టిఆర్ రూరల్, అర్బన్ హౌసింగ్, గ్రామీణ హౌసింగ్ పథకాల కింద జిల్లాలో మంజూరు చేసిన గృహాలన్నింటినీ తక్షణమే గ్రౌండింగ్ చేయాలన్నారు. అలాగే పంచాయతీరాజ్, పర్యాటక శాఖ పనుల ప్రగతిని సమీక్షిస్తూ ఇప్పటి వరకూ చేపట్టిన ప్రాజెక్టులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీలోని 11 మండలాల్లో పెద్ద ఎత్తున ఉపాధిహామీ పనులు చేపట్టేందుకు ప్రభుత్వ సహకారం అవసరమని కోరారు. పలు పథకాల కింద జిల్లాలో మంజూరు చేసిన గృహనిర్మాణ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో వుడా ఉపాధ్యక్షుడు బసంత్ కుమార్, జివిఎంసి కమిషనర్ హరినారాయణన్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పి రవి సుభాష్, డ్వామా పిడి కల్యాణ చక్రవర్తి, పర్యాటక శాఖ ఇడి శ్రీరాములు నాయుడు, డిఆర్‌డిఎ పిడి సత్యసాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.