విశాఖ

కలెక్టర్‌తో సిట్ బృందం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 27: సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల భూ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విశాఖ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో మంగళవారం భేటీ అయింది. ఇప్పటికే పోలీసు శాఖతో ఒక సారి సమావేశమైన సిట్ అధినేత వినీత్ బ్రిజ్‌లాల్ తాజాగా కలెక్టర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడిన సంఘటనలపై సిట్ విచారించనుంది. ఇప్పటికే భూముల ట్యాంపరింగ్‌కు పాల్పడిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. తాజాగా సిట్ విచారణ కూడా ఈ అంశాలే కీలకంగా జరిగే అవకాశం ఉంది. మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లోనే అత్యధికంగా ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమణలకు గురికావడంతో సిట్ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారి బ్రిజ్‌లాల్, సభ్యులుగా ఉన్న సంయుక్త కలెక్టర్ జి సృజన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో సుదీర్ఘంగా చర్చించారు. భూ కుంభకోణంలోని పలు అంశాలపై వీరు చర్చించినట్టు సమాచారం.
అపరాధ రుసుం లేకుండా ఆస్తి పన్ను చెల్లించండి
* జూన్ 30 వరకూ గడువు
* జివిఎంసి కమిషనర్

విశాఖపట్నం, జూన్ 27: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)కి చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలను జూన్ 30వ తేదీలోగా చెల్లించాలని కమిషనర్ హరినారాయణన్ కోరారు. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరం ఆస్తిపన్ను జూన్ 30లోగా చెల్లిస్తే అపరాధ రుసుం నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు వెల్లడిచారు. నిర్ణీత గడువు జూన్ 30లోగా తొలి అర్ధసంవత్సరం ఆస్తిపన్ను చెల్లించని పక్షంలో 2 శాతం అపరాధ రుసుం నెలవారీగా వసూలు చేయడం జరుగుతుందన్నారు. అలాగే రెండో అర్ధ సంవత్సరం ఆస్తిపన్ను డిసెంబర్ 31లోగా చెల్లించిన పక్షంలో అపరాధ రుసుం ఉండదని పేర్కొన్నారు. దీనికి కూడా గడువు మీరిన పక్షంలో 2 శాతం అపరాధ రుసుం చెల్లించాల్సిందేనన్నారు. శత శాతం పన్నుల వసూలు ద్వారానే జివిఎంసి పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నారు.

పుర సేవ యాప్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించాలి
ఇప్పటి వరకూ స్మార్ట్‌వైజాగ్ యాప్ ద్వారా జరిగిన జివిఎంసి పన్ను చెల్లింపు లావాదేవీలకు సాంకేతిక అవరోధం ఏర్పడిన నేపథ్యంలో పురసేవ యాప్ ద్వారా ఆస్తిపన్ను, నీటి పన్ను, విఎల్‌టి చెల్లించాలని కమిషనర్ హరినారాయణన్ తెలిపారు. జివిఎంసి ఐటి విభాగానికి చెందిన అన్ని అప్లికేషన్లు, డేటాను ఇఆర్‌పి సొల్యూషన్స్‌కు అనుసంధానించడం వల్ల స్మార్ట్‌వైజాగ్ యాప్ ద్వారా పన్నుల చెల్లింపునకు అవరోధం ఏర్పడిందన్నారు. పురసేవ యాప్ ద్వారా ఇప్పుడు అన్ని చెల్లింపులను అనుమతిస్తున్నామని వెల్లడించారు.