విశాఖపట్నం

వ్యాధి నిర్ధారణ, వైద్యంతోనే మలేరియా నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 18: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) పరిధిలో వ్యాధి నిర్ధారణ, వైద్య సహాయం అందించడం ద్వారా మలేరియా నివారణ, నిర్మూలన సాధ్యమని కమిషనర్ హరినారాయణన్ అభిప్రాయపడ్డారు. సీజనల్ వ్యాధులు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల నిర్వహణ (ఇ-వైద్య)పై వైద్యాధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మలేరియా వ్యాధి నిర్మూలన, నివారణ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రక్త నమూనాలను సేకరించడం, పరీక్షల అనంతరం మాత్రమే మలేరియా నిర్ధారించాలన్నారు. నిర్ధారించినంత మాత్రాన వ్యాధి నిర్మూలన సాధ్యం కాదని, వ్యాధి సోకిన రోగులు క్రమం తప్పకుండా వైద్య సహాయం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదవుతున్న మలేరియా కేసుల వివరాలను తెలుసుకోవాలని, వీటిని సమీక్షించి వ్యాధి తీవ్రత మేరకు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో లేబ్ టెక్నీషియన్లకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని కోఆర్డినేటర్లను ఆదేశించారు. సిఎం ఆరోగ్య కేంద్రాల్లో అందే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజారోగ్య, మలేరియా విభాగాలు నిర్వహించే యాంటీ లార్వా ఆపరేషన్స్‌ను క్రమం తప్పకుండా సమీక్షించాలని సూచించారు.
అలాగే జివిఎంసి పరిధిలో ఇమ్యునైజేషన్, పల్స్‌పోలియో కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఐసిడిఎస్, ఎఎంఓహెచ్‌ల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరంలో మలేరియా, డెంగీ వ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో సిఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ హేమంత్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఉమాసుందరి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జీవన రాణి, యుసిడి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసన్, డిపిఎం డాక్టర్ దేవి, జియాలజిస్ట్ వై మణి, జిల్లా మలేరియా అధికారి తదితరులు పాల్గొన్నారు.

కాలువల్లో పూడిక తీయాలి
* గెడ్డలను పరిశీలించిన కమిషనర్
విశాఖపట్నం, జూలై 18: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. గెడ్డల్లో పేరుకుపోయిన చెత్తతో పలు చోట్ల మురుగునీరు పొంగి రోడ్లపై ప్రవహిస్తోంది. జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ క్షేత్ర పర్యటనలో భాగంగా మంగళవారం నగరంలోని 28వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించి, గెడ్డలను పరిశీలించారు. అస్సాం గార్డెన్స్, అల్లిపురం, చావులమదుం ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. గెడ్డలు, కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగించాలని ఆదేశించారు. 28వ వార్డు కార్యాలయాన్ని సందర్శించి పారిశుద్ధ్య కార్మికుల హాజరును పరిశీలించారు. బయోమెట్రిక్ హాజరు ఉన్నప్పటికీ ఎనిమిది మంది కార్మికులు విధులకు గైర్హాజరైనట్టు గుర్తించి ఎఎంహెచ్‌ఓ, శానిటరీ ఇనస్పెక్టర్‌ను ప్రశ్నించారు. బయోమెట్రిక్ హాజరు క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు. ప్రజలు కూడా చెత్తను ఒపెన్ పాయింట్స్, కాలువల్లో వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పర్యటనలో జోనల్ కమిషనర్ వి చక్రధరరావు, ఎఎంఓ డాక్టర్ సుధాకర్, ఎయి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.