విశాఖపట్నం

బ్యాంకుల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో సంస్కరణ తీసుకురావడానికి వ్యితిరేకంగా బ్యాంకు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ఒక రోజు సమ్మె విజయవంతమైంది. సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకై నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి, జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ఈ సందర్భంగా యూనియన్ నగర కన్వీనర్ సిఎఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, నిరర్ధక ఆస్తుల విలీనం, కార్పొరేట్ సంస్థల రుణమాఫీ, తదితర నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈనిర్ణయాల వల్ల బ్యాంకులు ఆర్థికంగా కుంగిపోతాయన్నారు. ఫైనాన్స్ రిజల్యూషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు-2017ను ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందన్నారు. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే డిపాజిట్ దార్లకు రక్షణగా ఉన్న డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ వంటి సదుపాయాలు ఇకపై ఉండవన్నారు. కార్పొరేట్ సంస్థల మొండి బకాయిలు బ్యాంకుల మనుగడకే ప్రమాదంగా మారిందన్నారు. రుణ ఎగవేత దార్ల జాబితాలను ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ పేరిట బ్యాంకు ఛార్జీలను పెంచడం వల్ల ఖాతాదార్లపై అదనపు భారం పడుతుందని, ఇది సామాన్యులకు ఆర్ధికంగా ఇబ్బందని అన్నారు. పెద్దనోట్ల రద్దు సందర్భంగా అనేక వ్యయ,ప్రయాసలకు ఎదుర్కొన్నారన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం సరిగా స్పందిచలేదని ఆరోపిచారు. బ్యాంకు పాలకమండళ్లలో ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడనాడి, ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో ఐక్యకార్యాచరణ సమితి అనుబంధ యూనియన్ నాయకులు ఎన్ సాంబశివరావు, యుగంధర్, రవి కుమార్, జి వాసుదేవరావు ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

===
జివిఎంసి ఎన్నికలకు సన్నద్ధం కండి
భీమునిపట్నం, ఆగస్టు 22: త్వరలో జరగనున్న జివిఎంసి ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర మానవ వనురుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానికంగా మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి పార్టీ సమన్వయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలను జీవిఎంసిలో కలుపుతూ 71నుండి 82వార్డులు పెరగనున్నాయన్నారు. భీమిలి మండలంలో 5పంచాయితీలను మినహాయించి మిగిలిన భీమిలి అర్బన్ ప్రాంతం జివిఎంసి పరిధిలోకి వస్తున్నదన్నారు. జివిఎంసికి సంబంధించి 1వ వార్డు భీమిలి నుండి ప్రారంభం కానున్నదన్నారు. పార్టీ శ్రేణులంతా ఇప్పటినుండి జివిఎంసిలో తెలుగుదేశం గెలుపునకు కృషిచేయాలన్నారు.
సమన్వయ సమావేశం కొనసాగే తీరు ఇదేనా?:మంత్రి అసహనం
నెలకోసారి నిర్వహించే నియోజక వర్గస్థాయి పార్టీ సమన్వయ సమావేశం మంగళవారం జరిగిన తీరుపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమన్వయ సమావేశంకు మూడు మండలాల నుండి పలువురు రాకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తచేశారు. ఇకమీదట అలా జరగకుండా ఆయా వార్డులు, ప్రాంతాల నాయకులు వారి పరిధిలో గల సమస్యలను సమావేశంకు ముందుగానే పార్టీ కార్యాలయంకు నివేదించాలన్నారు. అనంతరం సమావేశంలో చర్చించి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. త్వరలో ప్రతివార్డులోను, అపతి పంచాయితీలోను ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టాలని దానిలో భాగంగా నిర్వహించే సమావేశంకు తనతో పాటు అందరూ విధిగా హాజరు కావాలని కోరారు. సమావేశంలో భీమిలి, తగరపువలస, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో నెలకొన్న సమస్యలను నాయకులు మంత్రి ముందు ఉంచారు. కార్యక్రమంలో మండలాల అధ్యక్షుడు గంటా నూకరాజు, కొప్పల రమేష్, దంతులూరి అప్పలనర్సింహరాజు, కాళ్ల నగేష్, ఎంపిపిలు యరబాల కృష్ణవేణి, చెన్నా వరలక్ష్మి పాల్గొన్నారు.