విశాఖపట్నం

టిడిపికి కార్యకర్తలే బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని ,సుశిక్షుతులైన కార్యకర్తలను తయారు చేయడానికి పార్టీ నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఎమ్మెల్సీ ఎంవివి ఎస్ మూర్తి అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో టిడిపి కార్యకర్తల శిక్షణ కార్యక్రమాల ప్రారంభ సందర్భంగా బుధవారం తనను కలిసిన శిక్షణ కేంద్రం అధ్యక్షుడు కె. అప్పలనాయుడుని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలల్లోకి తీసుకువెళ్లి ఎక్కువ మంది ప్రయెజనం పోందేలా కృషి చేయాలని కొరారు.ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కష్టపడి పని చేసేవారికి తగిన గుర్తింపు వుంటుందన్నారు.
ర్యాగింగ్ రహితంగా ఎయు
* విసి నాగేశ్వర రావు

విశాఖపట్నం, ఆగస్టు 22: ర్యాగింగ్ రహితంగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నట్టు వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జి నాగేశ్వర రావు అన్నారు. ఎయు మైక్రోబయాలజీ విభాగంలో మంగళవారం జరిగిన ఫ్రెషర్స్‌డే వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు తమ బాధ్యతలను గుర్తెరిగి నడుచుకోవాలన్నారు. వర్శిటీ కల్పించే సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వర్శిటీ గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆచార్య వి ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ పరిమిత వనరులతో అపరిమిత ప్రగతి సాధిస్తున్నారన్నారు. మెరుగైన అవకాశాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ విభాగంలో శతశాతం ఉత్తీర్ణత రావడం మంచి పరిణామమన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డి బాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావాలన్నారు. అవకాశాలకు కొదవ లేదని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సందేహాలను తరగతిగదిలోనే నివృత్తి చేసుకోవడం ద్వారా విద్యార్థులు పరిణితి సాధించాలన్నారు. సమావేశంలో ఆచార్య పికె రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాలలో గెలుపునకు సింహాచలేశునికి పూజలు
సింహాచలం, ఆగస్టు 22, నంద్యాల నియోజక వర్గం ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్థి గెలవాలని 72వ వార్డు టిడిడి నాయకులు మంగళవారం సింహాచలేశుని తొలిపావంచా వద్ద పూజలు చేసారు. అడివివరం సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి నేతృత్వంలో టిడిపి శ్రేణులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ప్రార్థించారు.