విశాఖపట్నం

బ్యాంకులఉత్తర్వులు సరే...అమలు ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ): ఇంటర్మీడియెట్ కళాశాలల్లో విద్యార్థుల హజరు విధిగా బయెమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు, కార్పొరేటు యాజమాన్యాలు బేఖాతర్ చేస్తున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి బయెమోట్రిక్ విధానంలో విద్యార్థుల హజరు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే జిల్లాలో ఒక్క కళాశాలలోనూ బయెమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ విధానం అమలుకు నిరాకరించే కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరికను సైతం పట్టించుకోకపొవడం గమనార్హం . ప్రభుత్వ ఆదేశాలను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్ బోర్డు అధికారులు సైతం ఈ విషయంలో పట్టించుకోవడంలేదు. జిల్లా లో కార్పొరేటు, ప్రైవేటు, ఎయిడెడ్ జానియర్ కళాశాలలు సుమారు 200కిపైగా వున్నాయి. వీటిలో ప్రథమ,ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 60 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు.బీసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థులకు ప్రతినెల రూ.325 చొప్పున పది నెలలకు రూ.3250 స్కాలర్‌షిప్ వస్తుంది. ఈ సోమ్ము కోసం చాలా కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వున్నాయి. విద్యార్థులు కళాశాలకు రాకుండానే హజరును రికార్డులలో చూపి ఆయా విద్యార్థుల స్కాలర్‌షిప్ సొమ్మును కాజేస్తున్నారు. అంతే కాకుండా హజరు తక్కువ ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా జానియర్ కళాశాలలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం బయెమెట్రిక్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి విద్యార్థి ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసింది. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేలిముద్ర ద్వారా హజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే ప్రతి వంద మంది విద్యార్థులకు ఒక బయెమెట్రిక్ యంత్రం చొప్పున కళాశాలలో చేయాలని ఇంటర్‌బోర్డు ఆదేశించిన ఏక్కడా అమలు కావడంలేదు.
* తప్పక అమలు చేయాలి
: ఆర్ ఐ ఒ
జిల్లాలో వున్న అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు ,కార్పొరేటు కళాశాలలో విద్యార్థుల హజరును తప్పని సరిగా బయెమెట్రిక్ విధానంలోనే నమోదు చేయాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. స్పాట్ సమయంలో వచ్చిన బయెమెట్రిక్‌లను పలు కళాశాలలకు అందజేసామని నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు ఆర్ ఐ ఒ నగేష్ తెలిపారు.
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
జగదాంబ, ఆగస్టు 22: జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఈ నెల 23న స్థానిక జెడ్పీ సమావేశమందిరంలో జరుగుతున్నట్లు జెడ్పీ సి ఇ ఒ జయప్రకాష్ నారాయణ తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి జరగనున్న ఈ సమావేశం జడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ ఆధ్వర్యంలో జరుగుతోందన్నారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యెలు, జిల్లాఅధికారులు హజరువుతారన్నారు.