విశాఖ

ముగ్గురు మిలీషియా సభ్యులు లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.డి.పేట, ఆగస్టు 22: మూడేళ్ళుగా మావోయిస్టులతో పని చేస్తూ వారి సిద్ధాంతాలు, దురాగతాలు నచ్చక తాము స్వచ్చందంగా పోలీసులకు లొంగిపోతున్నట్లు ముగ్గురు మిలీషియా సభ్యులు తెలిపారు. ఈమేరకు కృష్ణాదేవిపేటలో కొయ్యూరు సి. ఐ. పి.వి.వి. ఉదయ్‌కుమార్, మంప ఎస్సై డి.శ్రీనివాస్ సమక్షంలో మంగళవారం క్యాంప్ కార్యాలయంలో వారు లొంగిపోయారు. కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ రేవులకోటకు చెందిన కించే సీతారామ్(23) ఇదే పంచాయతీ ఈదులబంద గ్రామానికి చెందిన మర్రి గోపాలరావు(33), వంతల అప్పన్న (23) ముగ్గురు మిలీషియా సభ్యులు లొంగిపోయినట్లు సి. ఐ. ఉదయ్‌కుమార్ తెలిపారు. ఈసందర్భంగా సి. ఐ. మాట్లాడతూ గిరిజనుల కోసం పోరాటం చేస్తున్నామని చెబుతున్న మావోల వలన ఏమాత్రం అభివృద్ది లేదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా అసంఘిత శక్తుల వలన వారికి అందడం లేదన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వపరంగా వచ్చే రాయితీలు, ఎస్పీ, ఎ ఎస్పీల ద్వారా వారికి పునరావాస చర్యలు కల్పిస్తామని సి. ఐ. ఉదయ్‌కుమార్ తెలిపారు. ఈసమావేశంలో ఎస్సై శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

* ఇద్దరి పరిస్థితి విషమం

గూడెంకొత్తవీధి, ఆగస్టు 22: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలం దుచ్చరపాలెం గ్రామ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు(30) మృతి చెందగా కుంకుంపూడి గ్రామానికి చెందిన గెమ్మిలి విష్ణు (20), బొర్రా చంద్రరావు(30)లు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం చింతపల్లి నుండి శ్రీనివాసరావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో గూడెం వైపు వస్తున్నాడు. ఇటువైపు నుండి కుంకుంపూడి గ్రామానికి చెందిన గెమ్మిలి విష్ణుతోపాటు చంద్రరావు, మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దుచ్చరిపాలెంలో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు తలకు బలమైన గాయాలయ్యాయి. 108 వాహనంలో చింతపల్లి తరలిస్తుండగా మార్గ మధ్యలో శ్రీనివాసరావు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన గెమ్మిలి విష్ణు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖ కె.జి.హెచ్.కు తరలించారు. గాయపడిన మరో వ్యక్తి బొర్రా చంద్రరావును చింతపల్లి కమ్యూనిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.