విశాఖ

మోగనున్న జీవిఎంసి ఎన్నికల నగారా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఆగస్టు 22: కోర్టు ఆదేశాల మేరకు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రేటర్ విశాఖ ఎన్నికల నగారా కూడా మోగే సమయం ఆసన్నం కాబోతోంది. ఇటీవలి గ్రేటర్ విశాఖ పరిధిలో 82 వార్డులుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో గ్రేటర్ విశాఖలో అనకాపల్లి పురపాలక సంఘంతోపాటు మండలంలోని కొప్పాక, రాజుపాలెం, పరవాడ మండలంలోని సాలాపువానిపాలెం, తాడి గ్రామాలు సైతం విలీనమయ్యాయి. అలాగే భీమునిపట్నం మున్సిపాల్టీ కూడా విలీనమయింది. 2013 జూలై 30న ఈ ప్రక్రియ జరిగింది. జీవిఎంసికి ఎన్నికలు జరపకపోవడంతో అనకాపల్లి పట్టణం విలీన గ్రామాల్లో జవాబుదారీతనం కొరవడింది. 50వేల జనాభాకు ఒక వార్డుగా నిర్ణయించనున్నట్లు తెలిసింది. ఆ ప్రకారం అనకాపల్లి పట్టణంలో 84వేలు, విలీన గ్రామాల్లో 16వేల జనాభా ఉంది. వెరసి లక్ష జనాభా ఉన్నందున రెండు వార్డులు ఏర్పాటు కానున్నాయి.
అనకాపల్లి జోనల్ పరిధిలోని ఈ రెండువార్డుల్లో గెలుపోటములు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వ్యక్తిగత ప్రతిష్ఠకు పెద్ద సవాల్ కానుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇక్కడి ఎమ్మెల్యేగా పీలా గెలుపొందడం, జీవిఎంసిలో పాలకవర్గం లేకపోవడంతో ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇక్కడి పాలన అంతా సాగుతోంది. జీవిఎంసి అనకాపల్లి జోనల్ పరిధిలో అధికార తెలుగుదేశం పార్టీ పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించే సరైన ప్రతిపక్షమే ఇంతవరకు కొరవడింది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సాఆర్ సిపికి ఇక్కడి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్ ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతంలో రాజకీయంగా పట్టు సాధించేందుకు తనదైన పంధాలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపధ్యంలో జరగనున్న జీవిఎంసి ఎన్నికలను అటు అధికార తెలుగుదేశం, ఇటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీల నేతల భవితవ్యానికి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది.
జీవిఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీకి దిగేందుకు అధికార తెలుగుదేశం పార్టీ తరపున చాలామంది నేతలే కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని సైతం ఆశించే నేతలు స్థానిక అధికార తెలుగుదేశం పార్టీలో ఉండటం విశేషం. అదే విధంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ పదవిని ఆశించిన నేతలు కూడా టిక్కెట్ కోసం తహతహలాడుతున్నారు. అనకాపల్లి జోనల్ పరిధిలోని రెండు కార్పొరేషన్ టిక్కెట్లు స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్ అభిమతానికి అనుగుణంగా ఖరారయ్యే పరిస్థితి లేకపోలేదు. అయితే వార్డులు విభజన, రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో రాజకీయ వరాలు తీవ్ర అయోమయ గందరగోళ పరిస్థితుల్లో సతమతమవుతున్నారు.