విశాఖపట్నం

విమ్స్‌ను ఎయిమ్స్ స్థాయికి అభివృద్ధి పరచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)గా నగరంలోని విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (విమ్స్)ను అభివృద్ధి పరచాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. విజేఎఫ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 100 ఎకరాల స్థలంలో 400 పడకలతో ఏర్పాటు చేసిన విమ్స్‌ను ఎయిమ్స్ స్థాయికి పెంచాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలకు వైద్య సేవలందిస్తున్న కెజిహెచ్‌ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి పరచడంతో పాటు విమ్స్‌ను కూడా రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆర్థిక వనరుల లోటు పేరిట విమ్స్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది ఎంతమాత్రం క్షమార్హం కాదన్నారు. పలు ఆరోగ్య సేవల విషయంలో ఇప్పటికే విమ్స్‌లో రోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విమ్స్ విషయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరు సరిగా లేదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు ఇప్పటికీ వెనుకబాటుకు గురవుతునే ఉన్నాయన్నారు. ఈప్రాంతంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగట్లేదన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ రైల్వే జోన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ స్పష్టత ఇవ్వట్లేదని మండిపడ్డారు. విభజన హామీల్లో భాగమైన రైల్వే జోన్ ప్రకటించేందుకు కేంద్రం ఎందుకు వెనుకంజవేస్తోందని ప్రశ్నించారు. మహానగరంగా రూపుదిద్దుకుంటున్న విశాఖలో మెట్రోరైల్ ప్రాజెక్టు ఎందుకు ప్రతిపాదన స్థాయి దాటట్లేదన్నారు. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న గిరిజనుల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.

టిడిపితోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి
* ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి
విశాఖపట్నం, సెప్టెంబర్ 18: నవ్యాంధ్రను అన్ని రంగాల్లోను అగ్రపథాన నిలపగలిగే సమర్ధత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే ఉందని ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి అన్నారు. ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో భాగంగా 34వ వార్డు తాటిచెట్లపాలెం ప్రాంతంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నవ్యాంధ్రకు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తూనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న టిడిపి ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు. ప్రపంచంలో ప్రఖ్యాత పరిశ్రమలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలను ఒప్పించి, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో అవినీతి, అక్రమాలు ఉంటే నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసేలా చంద్రబాబు సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట మాజీ కార్పొరేటర్ పైలా ముత్యాల నాయుడు, అన్నంరెడ్డి వాణి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.