విశాఖపట్నం

గీతం వర్సిటీలో ఎమ్‌ఆర్క్ కోర్సు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: దేశంలోని అతి కొద్ది విశ్వవిద్యాలయాల్లో మాత్రమే ఆఫర్ చేస్తున్న ఎమ్‌ఆర్క్ (సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ కోర్సు)ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతితో ఈ ఏడాది నుంచి గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఎమ్‌ఆర్క్ తరగతులను గురువారం ప్రముఖుస సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.మోహన్ మాట్లాడుతూ దేశంలో 467కు పైగా ఆర్కిటెక్చర్ కళాశాలలు ఉండగా వాటిలో 86 కళాశాలల్లో మాత్రమే ఎమ్‌ఆర్క్ కోర్సు నిర్వహిస్తున్నారని స్మార్ట్ సిటీలకు అనుగుణంగా సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ పేరిట పీజీ కోర్సు అతి తక్కువ విద్యా సంస్థల్లో మాత్రమే ఉందనిన్నారు. నిర్మాణ రంగంలో వ్యర్థాలను తగ్గించి పర్యావరణానికి మేలు కలిగేలా భవనాల నమూనాలను రూపొందించడంలో సస్ట్భైబుల్ ఆర్కిటెక్చర్ నిపుణుల అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ బిల్డింగ్, బయో క్లైమేటింగ్ ఆర్కిటెక్చర్ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగం దృష్టి సారిస్తోందన్నారు. సాదారణ భవనాల నిర్మాణం వల్ల పర్యావరణంపై దుష్ప్రభావాలు ఉంటాయని గుర్తించిన మీదట సస్టైనబుల్ ఆర్కిటెక్చర్‌పై ప్రతిఒక్కరూ దృష్టిసారించారన్నారు. ఈ కారణంగా గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ద్వారా ఎమ్‌ఆర్క్ కోర్సును నూతనంగా ప్రారంభించినట్టు పేర్కొన్నారు. గీతం విశ్వవిద్యాలయం బిఆర్క్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా దాపాపు 10 దేశాల్లో ఆర్కిటెక్చర్ నమూనాలను అధ్యయనయాత్రలో సందర్శించారని, ఎమ్‌ఆర్క్ విద్యార్థులకు ఈ అధ్యయన యాత్రలను వర్తింపుచేస్తామన్నారు. గీతం విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ ఎమ్‌ఎస్ ప్రసాదరావు మాట్లాడుతూ పరిశ్రమలు, వాహనాలు నుంచి వెలువడే కాలుష్యం కంటే భవనాల ద్వారా 40 శాతం మేర కార్బన్‌డైఆక్సైడ్ ఏటా వాతావరణంలోకి విడుదల అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిని తగ్గించాలంటే హరిత భవనాల నిర్మాణం జరగాలని, పర్యావరణ సమతుల్యత ఉన్నపుడే గ్లోబల్ వార్మింగ్ వంటివి అదుపులో ఉంటాయన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఐఐఎ) విశాఖ కేంద్రం చైర్మన్, ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎస్‌ఎల్‌ఎన్ శాస్ర్తీ మాట్లాడుతూ ఆర్కిటెక్చర్ వంటి కళాత్మక వృత్తి విద్యలను లోతుగా అర్ధం చేసుకోవాలని, ఆరిటెక్చర్ రంగంలో పరిశోధనలను విశ్వవిద్యాలయాల్లో ప్రోత్సహించాలని సూచించారు. ఎన్‌ఐటి-రాయ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ దెబసిసి సన్యాల్ మాట్లాడుతూ అభివృద్ధి అనేది పర్యావరణ రహితంగా సమతుల్యతతో ఉండాలన్నారు. దేశంలో వందకు పైగా స్మార్ట్ సిటిలను ప్రభుత్వం గుర్తించినప్పటికి అందులో ఒక్కటి కూడా ఇకో సిటీ లేకపోవడం గమనార్హమన్నారు. ప్రజలు పర్యావరణంతో కలసి ఆరోగ్యకర వాతావరణంలో నివశించేందుకు వీలైన జీవన యోగ నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిప్యూటి కృష్ణ కాశి తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో గీతం ఉపాధ్యక్షురాలు ప్రొఫెసర్ ఎమ్.గంగాధరరావు, ప్రొఫెసర్ వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎమ్.పోతరాజు, నగరంలోని పలువురు సీనియర్ ఆర్కిటెక్ట్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కిటెక్చర్ డిప్యూటి డైరెక్టర్ కృష్ణ కాశి తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో గీతం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఎమ్.గంగాధరరావు, ప్రొఫెసర్ వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎమ్.పోతరాజు, నగరంలోని పలువురు సీనియర్ ఆర్కిటెక్ట్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు. అమరావతి స్థూపం సహా పలు ఆర్కిటెక్చర్ నమూనాలను విద్యార్థులు స్వయంగా రూపొందించి ఈ ప్రదర్శనలో ఉంచారు.
ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
* సిపిఐ నేత నల్లయ్య డిమాండ్
విశాఖపట్నం, సెప్టెంబర్ 21: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సిపిఐ గ్రేటర్ విశాఖ నగర సమితి కార్యదర్శి వాసుపల్లి నల్లయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే వందరోజుల్లో ధరలు తగ్గిస్తామని, అవినీతిలేని పాలనను అందిస్తామని హామీనిచ్చాందని గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో వాగ్ధానాలు చేసారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు టిడిపి అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి చెల్లిస్తామని డ్వాక్రా మహిళలు, రైతులు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మూడేళ్ళు అయినా ఒక్క వాగ్దానం కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. బిజెపి, టిడిపిలు 90 శాతం ఉన్న పేద ప్రజలు, కార్మికులు, మత్స్యకారులు శ్రమ ద్వారా దేశానికి సంపదను కూడబెడుతున్న ప్రజలను గాలికి వదిలి ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబులు పోటీపడి ధరలను పెంచుతున్నారన్నారు. రైలు ప్రయాణం, గూడ్స్ రవాణాచార్జీలు లక్షా ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు పెంచడమే కాకుండా రెండు రూపాయల ప్లాట్‌ఫారం టికెట్‌ను రూ.20లకు పెంచిన ఘనత కేంద్రంలో మతతత్వ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఈ ప్రభుత్వాలకు పతనం తప్పదని హెచ్చరించారు. విశాఖలో మత్స్యకారులు, కార్మికులు సొంత ఇళ్ళు లేక అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నా అర్హులైన పేదలకు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ళు కేటాయించాలని కంచరపాలెం కప్పరాడ జంక్షన్ వద్ద ప్రజలు హైవే రోడ్డు దాటేందుకు పుట్‌ఫ్లైఓవర్‌బ్రిడ్జి నిర్మాణం జరిపించాలన్నారు. అలాగే కంచరపాలెం ఫ్లైఓవర్‌బ్రిడ్జి వద్ద అక్రమంగా తొలగించిన స్వాతంత్రసమరయోధుడు సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు చర్చించేందుకు సిపిఐ కంచరపాలెంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఉదయం 10 గంటలకు మహసభ ఉంటుందన్నారు.