విశాఖపట్నం

పరిశ్రమ ప్రతిష్ట పెరిగేది నాణ్యతతోనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: పరిశ్రమల ప్రతిష్ట పెరగాలంటే, అవి ఉత్పత్తి చేసే వస్తువుల్లో నాణ్యమైనవిగా ఉండాలని స్టీల్ ప్లాంట్ డైరక్టర్ (కమర్షియల్) పి రాయ్‌చదుర్థి అన్నారు. క్వాలిటీ కానె్సప్ట్స్, క్రియేటింగ్ వాల్యూ టు ది సొసైటీ అన్న అంశంపై క్వాలిటీ సర్కిల్ ఫోరం 17వ సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో రాయ్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, వినియోగదారులు ఏం కోరుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకుని, అందుకు తగిన విధంగా ఉత్పత్తులు ఉండాలని సూచించారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తి సాధించేది ఎలా? అన్న అంశాన్ని యాజమాన్యాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ప్రతి కంపెనీ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఎ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ టాటా స్టీల్ నాణ్యత గురించి వివరించారు. క్యుసిఎఫ్‌ఐ కార్యదర్శి ఎంఎస్ శ్రీనివాస్, ఓఆర్ రమణి తదితరులు పాల్గొన్నారు.

నేవల్ డాక్‌యార్డ్‌లో ప్రమాదం
* ఇద్దరికి తీవ్ర గాయాలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 21: నేవల్ డాక్‌యార్డులో గురువారం మధ్యాహ్నం గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కూలింగ్ విభాగంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో నైట్రోజన్ సిలెండర్ పేలింది. ఈ ఘటనలో చందు, శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. వీరు మూడు నెలల కిందటే విధుల్లో చేరారు. గాయపడ్డ వారిని వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కార్మికవర్గాలు తెలియచేశాయి.