విశాఖ

మన్యంలో పల్లె పల్లెకు రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 22: విశాఖ ఏజెన్సీలోని ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి గిరిజనుల జీవన విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు మెరుగైన జీవన విధానం అందించాలంటే రోడ్ల నిర్మాణం చేపట్టాలనే కృత నిశ్చయంతో ఉన్నాయని అన్నారు. ఏజెన్సీలో రహదారి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలకు రానున్న రోజుల్లో రోడ్లను నిర్మించే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన చెప్పారు.
2017-18వ ఆర్థిక సంవత్సరానికి పి.ఎం.జి.ఎస్.వై. పథకం కింద ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు మంజూరైనట్టు ఆయన తెలిపారు. ఈ నిధులతో మన్యంలోని ప్రధానమైన 30 రోడ్ల నిర్మాణ పనులను చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. అంతేకాకుండా ఎల్.డబ్ల్యు.ఇ., పోలీస్ బ్లాక్స్ పథకాల కింద ఈ సంవత్సరం మరో 70 కోట్ల రూపాయలతో 50 రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ రహదారి పనులన్నీ డిసెంబర్ నెలలోగా ప్రారంభించాలని పంచాయతీ రాజ్ శాఖ పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఆయన ఆదేశించారు. ఏజెన్సీలోని పదకొండు మండలాల పరిధిలో 73 కోట్ల 40 లక్షల రూపాయలతో 174 డబ్ల్యు.బి.ఎం. రోడ్ల నిర్మాణాన్ని చేపట్టినట్టు ఆయన చెప్పారు. గత సంవత్సరం మిగిలిపోయిన 26 కోట్ల రూపాయల విలువైన 756 సి.సి.రోడ్ల పనులకు గాను 7 కోట్ల 80 లక్షలతో 120 పనులను పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. విశాఖ మన్యానికి 6 కోట్ల 65 లక్షల రూపాయలతో రెండు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకాలు మంజూరైనట్టు ఆయన తెలిపారు. అరకులోయలో 4 కోట్ల 65 లక్షల రూపాయలతో, చింతపల్లిలో రెండు కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి పరిపాలనపరమైన అనుమతులు లభించాయని, ఇందుకు సంబంధించిన డి.పి.ఆర్.లు తయారు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖకు 210 అంగన్‌వాడీ భవన నిర్మాణాలు అప్పగించగా ఇంతవరకు కేవలం 51 భవన నిర్మాణాలను మాత్రమే పూర్తి చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. అంగన్‌వాడీ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రవిసుభాష్ ఆదేశించారు. ఈ సమావేశంలో పలు శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.