విశాఖపట్నం

తాత్విక మూలాలు త్యారాజస్వామి కీర్తనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: భారతీయ తాత్విక మూలాలు త్యాగరాజస్వామి కీర్తనల్లో దర్శనమిస్తాయని ఎయు మాజీ రెక్టార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ సంచాలకులు ప్రొఫెసర్ ఎ ప్రసన్నకుమార్ అన్నారు. ఎయు సంగీత, నృత్య విభాగం, విశాఖ ఆర్ట్ అండ్ డాన్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగరాజ స్వామి 250వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం త్యాగరాజ స్వామి కీర్తనల గొప్పతనాన్ని చాటుతుందన్నారు. సుఖమయ జీవితాన్ని అన్నమయ్య కీర్తనల ద్వారా మనం తెలుసుకోవచ్చన్నారు. ఆంధ్రుల హృదయ్లా ఆయన నిత్యం కొలువై ఉంటారన్నారు. ఎయులో త్యాగరాజ స్వామికి సంబంధించి పుస్తకాలను, అందులో సారాంశాన్ని ఆయన వివరించారు. ఎయు ఆర్ట్స్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ ఆచార్య కె రామమోహన రావు మాట్లాడుతూ గానంతో త్యాగరాజ స్వామి భగవత్ సాక్షాత్కారాన్ని సాధించారన్నారు.త్యాగరాజ కీర్తనలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, సంరక్షించేందుకు ప్రభుత్వాలు చూపుతున్న చొరవ ఆశించిన స్థాయిలో లేదన్నారు. భగవత్ సాక్షాత్కారాన్ని సాధించిన వాగ్గేయకారులు మన దేశంలో జన్మించడం గర్వకారణమన్నారు. త్యాగరాజ స్వామి జయంతి నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. ఆయన రచనలను పూర్తి స్థాయిలో ప్రజా బాహుళ్యంలోకి తీసుకువచ్చేందుకు, విస్తృత ప్రాచుర్యం కల్పించాలన్నారు. కళాభారతి వ్యవస్థాపకులు సిఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ విభిన్న గాయకుల, సంగీతకారుల ప్రదర్శనలను తిలకించాలన్నారు. కళాభారతిలో ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు తిలకిస్తూ మెళకువలు నేర్చుకోవాలన్నారు. విభాగాధిపతి సరస్వతి విద్యార్థి మాట్లాడుతూ త్యాగరాజ స్వామి నిత్యం శ్రీ వేంకటేశ్వరునితో నేరుగా సంభాషించేవారన్నారు. ఉపనిషత్తుల సారం త్యాగరాజ స్వామి కీర్తనల్లో మనకు దర్శనమిస్తుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అనుపమ కైలాష్, వాడా కార్యదర్శి కెవి రమణ,విభాగాచార్యులు మండపాక శారద, అనురాధ, పెద్ద సంఖ్యలో సంగీత, నాట్య కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు.

ఎంపి హరిబాబును కలుసుకున్న బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన ప్రతినిధులు

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ నుండి డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, పొలిటికల్ ఎకాననీ అడ్వైజర్ నళిని రఘురామన్ విశాఖ పర్యటనలో భాగంగా ఎంపి కంభంపాటి హరిబాబును ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపి హరిబాబు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ బృందానికి అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరు, రాష్ట్రంలోని రాజకీయ అంశాలతో పాటు ఎపిలో జరుగుతున్న అభివృద్ధిని చర్చించారు.