విశాఖపట్నం

రోగులకు ప్రశాంత వాతావరణం కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు అన్నారు. వాల్తేరులోని మానసిక రోగుల ఆసుపత్రిలో బిజెపి మెడికల్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణ మొక్కలతో పచ్చగా ఉంటే ఇక్కడకు వైద్యం నిమిత్తం వచ్చే రోగులు మానసికంగా ఆహ్లాదంగా ఉంటారన్నారు. మొక్కలను కనుపాలల్లా కాపాడుకోవాలని, అప్పుడే ప్రకృతి మనకు మంచి జీవనాన్ని అదిస్తుందన్నారు. మానవుని మనుగడకు ప్రకృతి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. భారతీయ జనతాపార్టీ మెడికల్ సెల్ కన్వీనర్ ఆర్ రవికుమార్ సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి, ఇఎన్‌టి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునాధబాబు, టిబి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాంబశివరావు సిజిహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణదేవరాయలు, డాక్టర్లు వి పద్మ, సురేఖ, శారద, పిఎస్‌ఎన్ రాజు, విజయలక్ష్మి, ప్రభాత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపి హరిబాబు సిజిహెచ్‌ఎస్‌ను సందర్శించి ఆసుపత్రిలో వౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. రోగులతో ముచ్చటించారు. ఆసుపత్రిలో వైద్యులను పెంచాలని సూచించారు.