విశాఖపట్నం

గణేశ్వరరావుకు లైవ్ డిటెక్టర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: రెవెన్యూ రికార్డుల తారుమారులో ఆరితేరిపోయిన గణేశ్వరరావుతో పోలీసులు నిజం చెప్పించలేకపోయారు. దాదాపూ ఐదు రోజులపాటు విచారించినా, గణేశ్వరరావు పెదవి విప్పలేదు. చివరకు లైవ్ డిటెక్టర్ ఉపయోగించి, గణేశ్వరరావుతో నిజం రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒకటి, రెండ రోజుల్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. విజయనగరంలో సర్వే ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గణేశ్వరరావును సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గణేశ్వరరావు విశాఖలో పనిచేసినప్పుడు తహశీల్దార్లను లోబరచుకుని రెవెన్యూ రికార్డులు తారుమారు చేశాడు. తహశీల్దార్లతో రెవెన్యూ రికార్డులను తన ఇంటికి రప్పించుకునేవాడని సిట్ విచారణలో వెల్లడైంది. ఈ రికార్డులను తారుమారు చేసేందుకు ఫోర్జరీ గణేశ్వరరావు ఫోర్జరీ సంతకాలు చేశాడు. మధురవాడ, ఎండాడ తదితర ప్రాంతాల్లో గణేశ్వరరావు వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణానికి పాల్పడ్డాడు. ఈ అభియోగాలపై గణేశ్వరరావును అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడికి తీసుకుని విచారించినా, గణేశ్వరరావు నోరు విప్పకపోవడంతో చివరకు లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఇండస్ట్రియల్ రోబోటిక్స్‌పై గీతం వర్క్‌షాప్

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: వాహన తయారీ రంగంలో పారిశ్రామిక రోబోట్‌ల వినియోగంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు గీతం విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ రోబోటిక్స్ ఇన్ ఆటోమోబైల్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై రెండు రోజుల వర్క్‌షాప్ శుక్రవారం ప్రారంభమైంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వైస్ చైర్మన్ ఎ సెల్వరాజ్ అల్పాన్సా ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ సాంకేతిక రంగంలో భారత్ సూపర్ పవర్‌గా అవతరిస్తోందన్నారు. పారిశ్రామికంగా భారత్‌ను అభివృద్ధి చేసే క్రమంలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. యువత తమ మేథస్సుతో సమాజం, దేశంపై తమదైన ముద్ర వేయాలని, అందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యతో పాటు పారిశ్రామిక మార్పులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఎస్‌ఎ వంటి విభాగాల ద్వారా విద్యార్థులకు సమకాలీన అంశాలపై అవగాహన కలిగి ఉండటం అభినందనీయమన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎంఆర్‌ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ విభాగం ద్వారా ఇప్పటికే పలు కనె్సల్టెన్సీ కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనిపై పలువురు విద్యార్థులు పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంజనీరింగ్ నిపుణుడు సూరజ్ వర్క్‌షాప్ లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ సలహాదారు ఎం అబ్దుల్ రజాక్, ఎస్‌ఎఇ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పివి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్‌ఇ గీతం ద్వారా ఈ ఏడాది జరగనున్న ఎస్‌ఎఇ వాహనాల రేసింగ్‌లో ఈ-బాజా పేరిట స్వయంగా రూపొందించుకున్న వాహనంతో పోటీ పడనున్నట్టు వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌లో విద్యార్థులు రూపొందించే పారిశ్రామిక రోబోలను శనివారం ప్రదర్శించనున్నారు.