విశాఖపట్నం

బిజెపిలో లుకలుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఉత్తర భారత దేశంలో విజయ కేతనాన్ని ఎగురవేసిన భారతీయ జనతాపార్టీ, దక్షిణాదిలో కూడా పాగా వేయడానికి పావులు కదుపుతోంది. మిత్రపక్షాలతో ముందుకు కదులుతూనే, సొంతంగా బలపడాలని బిజెపి భావిస్తోంది. 2019 ఎన్నికల్లో మోదీ ఇమేజ్‌తోపాటు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో జనం మధ్యకు వెళ్లాలంటూ పార్టీ అథిష్టానం ఇప్పటికే రాష్ట్రాలకు, పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపించింది. అథిష్టానం ఆదేశాలకు, ఆలోచనలకు అనుగుణంగా జిల్లా పార్టీ నేతలు పనిచేస్తున్నారా? అంటే లేదని పార్టీ వర్గాల నుంచి సమాధానం వస్తోంది.
జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తున్నట్టు నాయకులు చెపుతున్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీ బలపతోందని, ఎవ్వరూ ఊహించని రీతిలో సభ్యత్వ నమోదు జరిగిందని ప్రకటనలు ఇస్తున్నారు. అయితే, ఇవేవీ క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్లను బయటకు నెట్టేశారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించిన వారిని పార్టీ నుంచి పంపిస్తున్నారంటూ క్యాడర్ చెపుతోంది. డివిజన్ స్థాయి కమిటీలు వేశారు. ఆయా డివిజన్లలో నివాసం లేని వారిని తీసుకువచ్చి కమిటీల్లో వేశారంటూ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీకి పనికొచ్చే వారిని పక్కన పెట్టి, కాని వారిని అందలం ఎక్కిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.
మోదీ ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటున్నాయని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నా, జిల్లా, రాష్ట్ర నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు పూర్తిగా రెండేళ్ల వ్యవధి కూడా లేదు. ఈలోగా జివిఎంసి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ప్రజల్లోకి వెళ్లి ఓట్లడిగితే, ఎంతమంది వేస్తారు? దీనికి నాయకులు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందని క్యాడర్ అంటోంది. నాయకులెవ్వరూ జనాల్లోకి వెళ్లకపోవడం, బిజెపి పథకాలను జనాల మధ్యకు తీసుకువెళ్లలేకపోవడం, స్తబ్దుగా ఉన్న క్యాడర్‌ను ఉత్తేజ పరిచలేకపోవడం వంటి అనేక ప్రతికూల పరిస్థితులు పార్టీలో రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
మిత్రపక్షమైన తెలుగుదేశం, విపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏదో రకంగా నిత్యం జనం మధ్య ఉంటున్నాయి. ఆ పార్టీలు సంస్థాగతంగా బిజెపి కన్నా బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు ధీటుగా బిజెపి ఎదిగిన వార్డులు ఎన్నున్నాయి? ఇప్పుడున్న 72 వార్డుల్లో కనీసం 10 వార్డుల్లోనైనా బిజెపి సొంతగా నెగ్గుకు రాగలదన్న ధీమా ఆ పార్టీ నాయకత్వంలో ఉందా? పార్టీ అథిష్టానం ఇచ్చిన కార్యక్రమాలను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నాయే తప్ప, స్థానిక సమస్యలపై నాయకత్వం ఎందుకు కార్యాచరణ రూపొందించలేకపోతోంది? తమకంటూ ఎంతో కొంత క్యాడర్ ఉన్న వార్డుల్లోనైనా వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కావల్సిన బలాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా జరగడం లేదని పార్టీ శ్రేణులు చెపుతున్నాయి. రాష్టస్థ్రాయి నాయకులు విశాఖలోనే ఉన్నా, పదాధికారులు అందుకు తగ్గట్టుగా పనిచేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.