విశాఖ

మూగ జీవాలు మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, సెప్టెంబర్ 22: ప్రభుత్వం గోవధ, గోవుల అక్రమ రవాణాను నియంత్రించినా గోవుల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పరిమితికి మించి పశువులను కంటైనర్ వంటి వాహనాల్లో కదలకుండా కూరేసి అధికారుల కన్ను గప్పి తరలించుకుపోతున్నారు. ఈనేపధ్యంలోనే గురువారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో చింతాలమ్మ ఘాట్ రోడ్డులో పరిమితికి మించిన పశువుల లోడ్‌తో వస్తున్న వ్యాన్ బోల్తా పడడంతో 16 పశువులు మృత్యువాతకు గురయ్యాయి. తెలంగాణా రాష్ట్రానికి చెందిన పశువుల వ్యాపారులు విశాఖ మైదాన ప్రాంతంలో పశువులను కొనుగోలు చేసి కృష్ణాదేవిపేట, కొయ్యూరు మీదుగా తెలంగాణా రాష్ట్రానికి తరలించుకుపోతున్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో పశువుల లోడ్‌తో వస్తున్న వ్యాన్ చింతాలమ్మ ఘాట్ రెండవ మలుపులో ప్రమాదానికి గురై బోల్తా పడింది. వ్యాన్ నిండుగా పశువులు కట్టివేయబడడం, వ్యాన్ పక్కకు పడి చెట్టుకు ఆనుకుని ఉండిపోవడంతో పశువులన్నీ ఒకదానిపై ఒకటి పడి మెడలు బిగుసుకుపోయాయి. సంఘటన అనంతరం వ్యాన్ డ్రైవర్, క్లీనర్ తదితరులు పరారు కాగా విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు తెల్లవారు జామున సంఘటనా స్థలానికి వచ్చి కొట్టుకుంటున్న పశువుల కట్లను తెంచి బయటకు లాగారు. వ్యాన్ బోల్తా పడడంతో ఎనిమిది ఎద్దులు, ఐదు ఆవులు , మూడు దూడలు మృత్యువాతకు గురయ్యాయి. మిగిలిన వాటిలో కొన్నింటికి తీవ్ర గాయాలు కాగా మరికొన్నింటిని రక్షించిన కొందరు తరలించుకుపోయినట్లు సమాచారం. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించి కట్లు తెచ్చుకుంటే ఇన్ని పశువుల బలయ్యేవి కావని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కొయ్యూరు సి. ఐ. ఉదయ్‌కుమార్, ఎస్సై రుక్మంగధర్‌రావు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. ఎస్సై ఆధ్వర్యంలో కంఠారం పశువైద్యాధికారి కోటేశ్వరరావు మృతి చెందిన పశువులకు పంచనామా నిర్వహించి అనంతరం వాటన్నింటినీ పూడ్చి వేసారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంలో మూగ జీవాలు కొట్టుకుని చనిపోవడం చూసిన పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.