విశాఖ

చంద్రన్న బీమాపై మళ్లీ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, సెప్టెంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకంపై రెండో సారి సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని దాదాపు పదహారు వందల మంది లబ్ధిదారులు గతంలో సక్రమంగా వేలి ముద్రలు వేయకపోవడంతో వీరి పేర్లు పథకంలో నమోదు కాలేదు. దీంతో మరోసారి వీరి వేలిముద్రలను సేకరించేందుకు స్థానిక వెలుగు సిబ్బంది దేవి, ఉమాశంకరి, వెంకటలక్ష్మి, అశ్వని, సుజాత మరోసారి సర్వే చేపడుతున్నారు. గత కొన్ని రోజులుగా చేస్తున్న సర్వేలో ఇంతవరకు తొమ్మిది వందల మంది లబ్ధిదారుల వేలిముద్రలు, వారి వివరాలను సేకరించినట్టు వారు చెప్పారు. చంద్రన్న బీమాలో సభ్యులుగా నమోదైన వారికి ప్రభుత్వ పరంగా సహాయం లభిస్తుందని వారు అన్నారు. ప్రమాదవశాత్తు మరణించే వారికి ఐదు లక్షలు, సహజ మరణానికి రెండు లక్షల రూపాయల వంతున ప్రభుత్వం ఈ పథకం కింద లబ్ధిదారుల కుటుంభాలకు బీమా చెల్లిస్తుందని వారు చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హులైన లబ్ధిదారులంతా వినియోగించుకుని చంద్రన్న బీమాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని వారు కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సిపిఐ ధ్వజం

కోటవురట్ల, సెప్టెంబర్ 23: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సి.పి. ఐ. పార్టీ ధ్వజమెత్తింది. శనివారం మండలకేంద్రమైన కోటవురట్లలో సి.పి. ఐ. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వి. ప్రభాకర్, జిల్లా సహాయ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.కొండలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు తాతబ్బాయిలు విలేకరులతో మాట్లాడుతూ హామీలను గాలికి వదిలి ప్రజలను మభ్య పెడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిపాలన సాగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ, కులాల మధ్య చిచ్చు పెడుతూ ప్రశ్నించే వారిపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ముందు లేనిపోని వాగ్దానాలు చేసి ఫ్రజల్లో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చారన్నార. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న 75 లక్షల కోట్ల నల్లధనాన్ని స్వాధీనం చేసుకుని నిరుపేదల ఖాతాల్లో జమ చేస్తానని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా సి.పి. ఐ. పార్టీ ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. పాడేరులో 23వ జిల్లా మహాసభను నిర్వహించడానికి పార్టీ నిర్ణయించిందన్నారు.