విశాఖ

పథకాల అమలులో స్వచ్చంధ సంస్థల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డుంబ్రిగుడ, సెప్టెంబర్ 23: ప్రభుత్వ పథకాల అమలులో స్వచ్చంధ సేవా సంస్థలు కీలక పాత్ర పోషించాలని మాజీ శాసనసభ్యుడు కుంభా రవిబాబు సూచించారు. మండలంలోని అరమ పంచాయతీ ముసిరి, టుండ్రుంగుడ గ్రామాలలో నాలుగు లక్షల 60 వేల 27 రూపాయలతో నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో నిర్మించిన తాగునీటి పథకాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలలో అధికారులు, రాజకీయనాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ముసిరి, టుండ్రుంగుడ గ్రామాలలో నివశిస్తున్న గిరిజనులకు తాగునీటి సౌకర్యం కల్పించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. ఈ గ్రామాల గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన నవ నిర్మాణ సమితి ప్రతినిధులు గ్రావీటి పథకంతో నీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని ఆయన చెప్పారు. గిరిజన ఉప ప్రణాళిక కింద గిరిజన గ్రామాలకు విద్య, వైద్య పథకాలతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గిరిజనులకు బడ్జెట్‌లో కేటాయించిన 3 వేల 600 కోట్ల రూపాయలలో కేవలం ఆరు వందల కోట్లను మాత్రమే వెచ్చించారని, మిగిలిన నిధులు ఎమైనట్టని ఆయన ప్రశ్నించారు. గిరిజనాభివృద్ధికి కేటాయించిన కోట్లాది రూపాయల నిధుల వినియోగంపై గిరిజనులు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. మైదాన ప్రాంతాలలో ప్రతి కుటుంభానికి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో ఇటువంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని రవిబాబు విచారం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్బారావు, నవ నిర్మాణ సమితి ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ చిట్టిబాబు, ఇంజనీర్ డైరెక్టర్ వేణుగోపాల్, సాంకేతిక మేనేజర్ సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.