విశాఖపట్నం

27న విశాఖలో రాష్ట్ర పర్యాటక ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన రాష్టస్థ్రాయి ఉత్సవాలకు విశాఖపట్నం వేదిక కాబోతున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. శనివారం ఏయులో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏయు, పర్యాటక శాఖలు సంయుక్తంగా పర్యాటకంపై నిర్వహించిన ప్రాస్పెక్ట్స్ అండ్ పొటెన్షియల్ ఫర్ టూరిజం ఇన్ విశాఖపట్నం హబ్‌పై సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటక రంగం నుండి 80 శాతం వకరు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా ఈ రంగంలో అధికరంగా లభిస్తున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. వౌలిక వసతులను కల్పిస్తూ పర్యాటకులను ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపొందించడం జరుగుతోందన్నారు. విశాఖలో టి.యు 142 యుద్ధ విమానంతోపాటు 10 బీచ్‌లను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించగా కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. మధురవాడ, రుషికొండ, తొట్లకొండ, వాటర్‌ఫాల్స్, మంగమూరిపేట మరినా బీచ్, దల్లపల్లి రిజార్ట్స్ తదితర అభివృద్ధి కార్యక్రమాలతోపాటు, రుషికొండలో ప్రత్యేకంగా సేఫ్ స్విమ్మింగ్ జోన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. బీచ్ టూరిజం, ఐటి టూరిజం, టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం, హోటల్, హాస్పిటాల్టీ టూరిజం, ఏకో టూరిజం, స్పోర్ట్స్, ప్రాథమిక వసతులను కల్పించి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పర్యాటకంతోపాటు పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యతనిస్తున్నామని, ఆకర్షణీయ నగరంగా పేరొందిన విశాఖ మరింత ఆకర్షణీయంగా మారడానికి ప్రజల్లో పర్యాటకుల్లో చైతన్యం నింపేలా బీచ్ క్లీన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా నెలకో పెద్ద ఈవెంట్‌ను నిర్వహించనున్నామని, ఇప్పటికే ఈవెంట్ క్యాలండర్‌ను విడుదల చేయడం జరిగిందన్నారు. ఏయు రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పర్యాటక రంగంపై అవగాహన, ప్రచారం నిర్వహించడానికి,ప్రోత్సహించడానికి పలు మేనేజ్‌కమెంట్ కోర్సులను ఏయులో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంటు అధిపతి ఆచార్య ఎన్.సాంబశివరావు మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం యువతకు నాలుగు అంశాల్లో పోటీలు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకలు చెందిన వారే ఎక్కువుగా విజేతులుగా నిలిచారన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సుస్థిర పర్యాటకాభివృద్ధిపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాకు చెందిన యూనివర్శిటడీ, కళాశాలల్లో యువతకు పోస్టర్ పెయింటింగ్, పేపర్ ప్రజెంటేషన్, క్విజ్ కాంపిటేషన్, టూరిజం ఫొటోగ్రఫీలపై ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి జ్ఞాపికలు, సర్ట్ఫికేట్లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పర్యాటం ఇడి శ్రీరాములునాయుడు, జిల్లా పర్యాటకాధికారి పూర్ణిమదేవి, పలు స్వచ్చంధ సంస్థల సభ్యులు, హోటళ్ళ ప్రతినిధులు, యూనివర్శిటీ విద్యార్థులు హాజరయ్యారు.