విశాఖపట్నం

పెరిఅర్బన్ హార్టీకల్చర్ ప్రాజెక్టుకు విశాఖ స్మార్ట్‌సిటీ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పెరిఅర్బన్ హార్టీకల్చర్ ప్రాజెక్టుకు విశాఖ స్మార్టు సిటీ ఎంపికైందని, ఈ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకుని మహా విశాఖ నగరపాలకసంస్థ పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా, సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ కోరారు. శనివారం సాయంత్రం తన ఛాంబర్‌లో ఉద్యానవన శాఖ, జివిఎంసి, వుడా అధకారులు, పిఎస్‌యుల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 100 నగరాలను ఆకర్షణీయ నగరాలుగా అభివృద్ధిపర్చేందుకు ప్రాజెక్టు అమలకు తొలిదశలో కేవలం పది నగరాలను మాత్రమే ఎంపిక చేసిందన్నారు. ఆ పది నగరాల్లో విశాఖ నగరం ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. విశాఖ నగర పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా అమలుపర్చి దేశానికి ఆదర్శ నగరంగా విశాఖను తీర్చిదిద్దాలని అధికారులు ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు కింద ప్లెగ్‌టైప్ నర్సరీలు, రక్షిత వ్యవసాయం, పోస్టు హ్వారెస్టు మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ కంపొనెంట్స్ పథకాల కింద వంద శాతం రాయితీపై ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు, 35 నుండి 50 శాతం రాయితీపై ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందజేయనుందన్నారు. ఈ పథకాలను అమలుపర్చేందుకు ఉద్యానవనశాఖ, జివిఎంసి, వుడా అధికారులు, పిఎస్‌యుల ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధచూపాలన్నారు. అందుకు అవసరమైన ఫీజిబిలిటీ, నివేదికలను, డిపిఆర్‌లను రూపొందించి కేంద్రానికి నివేదించాలన్నారు. రైతుబజార్లలో ఖాళీ స్థలాను ఎక్కడ ఎక్కువుగా ఉంటే అటువంటి వాటిల్లో కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా ఉద్యానవనశాఖ సహాయ సంచాలకులు కె.శైలజ, ఉద్యానవన అధికారులు, జివిఎంసి, వుడా,అధికారులు, స్టీల్‌ప్లాంట్, విశాఖ పోర్టు, ఎన్‌టిపిసి తదితర పిఎస్‌యుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.