విశాఖపట్నం

డిసెంబర్ ఒకటవ తేదీ నుండి వైజాగ్ ఫెస్ట్-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: వైజాగ్ ఫెస్ట్-2017ను డిసెంబర్ ఒకటవ తేదీ నుండి 10వ తేదీ వరకు విశాఖపట్నం ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్‌లో జరుగుతుంది. ఫెస్ట్ లోగోను శనివారం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆవిష్కరించారు. గత వైజాగ్ ఫెస్ట్-2015 ఏప్రిల్‌లో జరిగిందని వైజాగ్ ఫెస్ట్-17 కార్యదర్శి ఏ.అజశర్మ తెలిపారు. విశాఖ ప్రజలు దీనిని ఆదరించారని, సుమారు మూడు లక్షల మంది పైగా ప్రజలు ఫెస్ట్‌కు హాజరయ్యారన్నారు. వైజాగ్ ఫెస్ట్-2017ను అంతకంటే భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్వహణ కమిటీ భావించిందన్నారు. సుమారు 150 దేశీయ, అంతర్జాతీయ పుస్తక పబ్లిషర్లతో బుక్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. ప్రజలను ఆకుట్టుకునే కళాప్రదర్శనలు ప్రతిరోజు జరుగుతాయన్నారు. గురజాడ సాహిత్య వేదిక నుండి ప్రతిరోజు పలు రంగాల ప్రముఖులతో కవితలు, ఉపన్యాసాలు, వివిధ అంశాలపై చర్చలు ఉంటాయన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీసే సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర, ఆంధ్ర రాష్ట్ర చరిత్రను ప్రతిబింబించే అనేక అంశాలు థీమ్ పెవిలియన్‌లో ఉంటాయి. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల నమూనాలు ప్రదర్శించబడతాయన్నారు. వివిధ వాణిజ్య సంస్థల స్టాల్స్ ఫెస్ట్‌లో ఏర్పాటు చేయడబడతాయి. బాలల ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుంది. యువజనలతో ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి. విద్యార్థులకు, రచయితలకు కథలు, కవితల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు హాజరవుతారన్నారు. ఈ విధంగా వైజాగ్ ఫెస్ట్-17 విజ్ఞానదాయకంగా, వినోదకరంగా, శాస్ర్తియ భావాలు పెంపొందించేదిగా, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర కళలను ప్రోత్సహించేదిగా జరుగుతుంది. విశాఖ ప్రజలను యాంత్రిక జీవనం నుండి మరల్చి, ఉల్లాసాన్ని నింపేదిగా ఉంటుందన్నారు. విశాఖ ప్రజలు, అధికారులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ నిర్వహణలో తమకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.