విశాఖపట్నం

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), సెప్టెంబర్ 24 : మనిషి ఆరోగ్యకరంగా జీవించాలంటే శ్వాస ఎంతో అవసరం. అలాగే రోగికి అత్యవసర సమయంలో అదే శ్వాసను (ఆక్సిజన్)ను అందించకపోతే ప్రాణాలే దక్కవు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఆసుపత్రి వర్గాల అలసత్వంతో ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అటు రోగులకు, ఇటు విధులు నిర్వహించే సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఏకైక ఛాతీ, అంటువ్యాధుల (టిబి) ఆసుపత్రిలో రోగులకు సరిపడా వెంటిలేటర్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చే రోగులకు తక్షణమే ఆక్సిజన్ అందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్ సదుపాయాన్ని అందించి వైద్యసేవలు అందిస్తూ వుంటారు. నగరంలోని చినవాల్తేరులో వున్న ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధులు (టిబి) ఆసుపత్రికి రోజుకి 150 నుంచి 200 వరకూ టిబి, శ్వాసకోశ సంబంధింత వ్యాధులతో బాధపడే రోగులకు ఓపి సేవలకు వస్తూంటారు. వీరిలో కనీసం పది నుంచి 15 మంది ఇన్‌పేషంట్లుగా జాయిన్ అవుతారు. రోగి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వారికి ఆసుపత్రిలో ఆయా వార్డుల్లో సేవలు అందిస్తారు. అత్యవసరంగా సేవలు అందించాల్సి వస్తే వారిని ఆర్‌ఐసియు వార్డులో వుంచి కృత్రిమ శ్వాసను అందించి వైద్యసేవలు అందిస్తారు. వాస్తవానికి ఈఆర్‌ఐసియు వార్డులో పది వరకూ వెంటిలేటర్లు అవసరం. కానీ ఆసుపత్రిలో పని చేస్తున్నవి నాలుగు మాత్రమే కావడంతో వాటినే రోగులకు సర్దుబాటు చేస్తూ కాలం గడుపుతున్నారే తప్ప కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. వెంటిలేటర్ల సంఖ్య పెంచాలని, రోగులకు సేవ చేసేందుకు ఇబ్బందులు తప్పడం లేదని ఎన్నిసార్లు ఆయా వార్డుల నర్సింగ్ సిబ్బంది, రోగులు మొరపెడుతున్నా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక వెంటిలేటర్‌తో ఇద్దరికి వైద్యం
ఆసుపత్రిని వేధిస్తున్న వెంటిలేటర్ల కొరత కారణంగా వున్న వాటిని సర్దుబాటు చేస్తూ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఒక్కొక్క రోగికి గంట చొప్పున కేటాయించి వెంటిలేటరు సేవలను అందిస్తున్నారు. ఇదే సమయంలో వార్డులో వున్న రోగులకి అత్యవసరంగా ఇబ్బంది అయితే శ్వాస ఆడక ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమయంలోనే రోగులు, రోగి బంధువులు విధుల్లో వున్న నర్సింగ్ సిబ్బంది, వైద్యులతో ఘర్షణలకు దిగుతున్నారు. ఇదంతా ఆసుపత్రిల్లో వున్న ఆయా యూనిట్లు ప్రోపెసర్‌లకు సైతం తెలిసినా మాకు ఎందుకులే అని పట్టించుకోకుండా వుండటంతో నర్సింగ్ స్ట్ఫాకు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఆసుపత్రిలో వేంటిలేటర్లు కోరత వున్న విషయంపై ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఆసుపత్రిల్లో వెంటిలేటర్లు కోరతపై కనీసం ఓక్కసారీ కూడా కలెక్టర్ దృష్టికి ఆసుపత్రి వర్గాలు తీసుకువెళ్లతేక పోవడం గమనర్హం. ఇప్పటికైనా ఆసుపత్రి వర్గాలు సమస్యను పరిష్కరించేందుకు చర్చలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. అలాగే ఆసుపత్రి అభివృద్ది నిధుల నుంచి అయినా కొనుగోలు చేసి రోగులు, నర్సింగ్ సిబ్బంది అవస్ధలు తీర్చాల్సిన భాధ్యత అధికారులపై వుంది. ఈ విషయంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖాధికారులు, కలెక్టర్ స్పందించి తక్షణమే రోగులకు సరిపడే వెంటిలేటర్లును ఏర్పాటు చేయాలని లేకుంటే ప్రాణాపాయ స్థితి తప్పదని పలువురు కోరుతున్నారు.