విశాఖపట్నం

27న సిఎం పర్యటన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన రద్దయింది. ఈ నెల 27న పర్యాటక దినోత్సవం సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరుకావాల్సి ఉంది. అలాగే పర్యాటక ప్రాజెక్టు టియు-142 యుద్ధ విమాన మ్యూజియంకు శంకుస్థాపన, ఎన్‌ఎడి ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే అదే రోజున విజయవాడలో దసరా సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కుటుంబంతో సహా హాజరుకానున్న దృష్ట్యా విశాఖ పర్యటన వాయిదా పడింది. అయితే అక్టోబర్ 9న సిఎం చంద్రబాబు విశాఖ వచ్చే అవకాశాలున్నాయని అధికార యంత్రాంగం భావిస్తోంది.