విశాఖపట్నం

అన్నీ పరిశీలించాకే ఎన్‌ఏడి ఫ్లైఓర్‌కు ఓకే చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: ఎన్‌ఏడి వద్ద ఫ్లైఓవర్ నిర్మించే అంశాన్ని నిపుణలు, మేధావులతో అనేకసార్లు చర్చించాం. ఎన్‌ఏడి వద్ద ఫ్లైఓవర్ నిర్మించాల్సిన ఆవశ్యకతను కూడా గుర్తించాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వుడాకు భారమవుతుందని అనడం సమంజసం కాదని వుడా వైస్ చైర్మన్ బసంత్ కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఫ్లైఓర్ నిర్మాణానికి 122 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, దీని విజయ్ నిర్మాణ్ కంపెనీ, ఎం వెంకటరావు కంపెనీ బిడ్లు దాఖలు చేశారని చెప్పారు. విజయ్ నిర్మాణ్ కంపెనీ ఏడు శాతం తక్కువకు, ఎం వెంకటరావు కంపెనీ రెండు శాతం ఎక్కువకు బిడ్‌లు దాఖలు చేశారని, దీంతో విజయ్ నిర్మాణ్ కంపెనీకి టెండర్ ఖరారు చేశామని ఆయన తెలియచేశామని వి.సి. చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయని ఆయన వివరించారు. ఫ్లైఓవర్‌కు ఎక్కువ లైక్‌లు పొందిన డిజైన్‌నే ఆమోదించామని ఆయన చెప్పారు. రెండు సంవత్సరాల్లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావల్సి ఉందని, నిర్మాణ సంస్థ అంతకు ముందుగానే దీన్ని పూర్తి చేసే అవకాశం ఉందని బసంత్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కొంత భాగం ప్రయోగాత్మక జరగబోతోందని ఆయన వెల్లడించారు. దీనివలన కొంత ఖర్చు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. అయితే దీనికి కావల్సిన మొత్తాన్ని రుణ రూపంలో తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా ఎల్‌ఆర్‌ఎస్‌ల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని బసంత్ కుమార్ చెప్పారు. కాగా, టియు-142 విమాన మ్యూజియంకు సిఎం చంద్రబాబు 27న శంకుస్థాపన చేయాల్సి ఉందని, ఆ కార్యక్రమం తొమ్మిదో తేదీకి వాయిదా పడిందని చెప్పారు. అయితే, ఈ మ్యూజియంను రాష్టప్రతి రాజనాథ్ కోవింద్ డిసెంబర్ ఎనిమిదిన ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలియచేశారు.
భారత్ క్యూ.ఆర్ చెల్లింపులకు ప్రాధాన్యత
డిజి సంకల్ప్‌లో భాగంగా భారత్ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులను ప్రోత్సహించేందుకు వుడా కార్యాచరణ రూపొందించిందని బసంత్ కుమార్ చెప్పారు. హెచ్‌డిఎఫ్‌సితో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నామని అన్నారు. స్మార్ట్ ఫోన్, అందులో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చని అన్నారు. భారత్ క్యూ.ఆర్ ద్వారా నగదు చెల్లింపులు జరిపినందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుకు 0.25 శాతం కమిషన్ చెల్లిస్తామని ఆయన చెప్పారు. అలాగే ఒక కుటుంబం మొత్తం ఈ చెల్లింపులు జరిపితే, ఆ మొత్తంలో 0.25 శాతం రాయితీ ఇస్తామని ఆయన తెలియచేశారు.