విశాఖ

ఆర్టీసీ సరికొత్త పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 22: ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులో చివరి సీట్లలో కూర్చునే ప్రయాణికులకు రాయితీ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ విశాఖ రీజియన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ అప్పలనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు తరలివెళ్ళే ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా ఉండే విధంగా ఛార్జీల్లో వీలైనంత మేర రాయితీ సౌకర్యం కల్పించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రీజనల్ మేనేజర్ సుదేశ్‌కుమార్ సూచనల మేరకు తాము ఈ నెల 25 నుంచి ఈ సరికొత్త విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో 250 కిలోమీటర్లు పైబడి ప్రయాణించే వారికి, ఆన్‌లైన్ రిజర్వేషన్ ప్రయాణికులకు 20 శాతం రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఎక్స్‌ప్రెస్‌లో వెనుక 11 సీట్లు, అదే డీలక్స్ బస్సులో వెనుక తొమ్మిది సీట్లలో కూర్చొనే ప్రయాణికులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. అలాగే విశాఖ-చెన్నై మధ్య అమరావతిలో ప్రయాణించే వారికి అమరావతిలో రూ.1634లు టికెట్ ఛార్జీలుండగా, ఇందులో రూ.165లు, అదే గరుడలోనైతే రూ. 1404లకుగాను, రూ.141లు రాయితీ కల్పించామన్నారు. ఇది ఈ నెల 19వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ విధంగా చెన్నైకు ఇక్కడి నుంచి రెండు బస్సులు నిర్వహిస్తున్నామన్నారు. దీనికి ఆదరణ లభిస్తున్నందున విస్తరించే ఆలోచన చేస్తున్నామన్నారు. అలాగే విశాఖ-బెంగుళూరు మధ్య ఒక ప్రత్యేక బస్సు నడుస్తుందని, ఇందులో రూ.1914లకుగాను, రూ.192లు రాయితీ ఉంటుందన్నారు. ఈ విధంగా డిమాండ్‌నుబట్టి చార్జీల తగ్గింపు, స్వల్పంగా పెంపు అనేవి ఉంటాయన్నారు. దీనిని ప్రయాణికులు గమనించి సద్వినియోగపరుచుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉందని, అలాగే రాయితీ సదుపాయాలపై మరింత అవగాహన కల్పించుకోవాలన్నారు. త్వరలో ప్రయాణికులకు వాటర్ బాటిళ్ళు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు. వెయ్యికి పైగా నడిచే బస్సుల ద్వారా దాదాపు కోటి రూపాయల మేర రోజువారీ ఆదాయాన్ని సాధిస్తున్నామన్నారు. రూ.90 నుంచి కోటి రూపాయల వరకు వస్తుంటుందని దీనిని మరింతగా పెంచేందుకు అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.