విశాఖ

పారిశుద్ధ్యం తీరుపై కమిషనర్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 22: అధ్వాన్నంగా ఉన్న పారిశుద్ధ్య పరిస్థితులపై జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోన్ పరిధిలోని 26వ వార్డులో శుక్రవారం పర్యటించిన కమిషనర్ కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటరీ సూపర్‌వైజర్, పారిశుద్ధ్య కార్మికునికి జీతాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. జోన్ 3లో బాధ్యతలు నిర్వహిస్తున్న సహాయ వైద్యాధికారి డాక్టర్ శంకరరావును మాతృ శాఖ సాగర్ నగర్ డిస్పెన్సరీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో జోన్ 4 ఎఎంహెచ్‌ఓను అదనపు బాధ్యతలు అప్పగించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా 26వ వార్డు కొత్తరోడ్డు, రాజారామ్‌మోహన్ రోడ్డు, వెలంపేట, సిబిఎం హైస్కూల్ తదితర ప్రాంతాలను శుక్రవారం సందర్శించిన కమిషనర్ అక్కడ పరిస్థితులు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెయిన్లకు శ్లాబులు వేసి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువల్లో పూడికతీసేందుకు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. క్షేత్ర పర్యటనలో కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ బాపిరాజు, ఇఇ మహేష్, డిఇ వెంకటరావు, ఎడిహెచ్ దామోదర్, తదితరులు ఉన్నారు.

కెజిహెచ్‌కు కరెంట్ కష్టాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 22: వేసవి కాలం వస్తుందంటే చాలు...కెజిహెచ్‌కు కరెంటు కష్టాలు మొదలవుతాయి. ప్రతి ఏడాది వీటిని అధిగమించడం కోసం ఆసుపత్రి వర్గాలు నానా అవస్థలు పడుతుంటారు. వేసవి మూడు మాసాల్లో ఒకటి, రెండుసార్లు అయినా సమస్యలు తప్పవు. కొవ్వుత్తుల వెలుతురులో సైతం శస్తచ్రికిత్సలు, పరీక్షలు జరిపే రోజులున్నాయి. ఆసుపత్రి అంతటికీ సరిపడే సామర్ద్యం కలిగి ఉండే 500 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ ఉంది. దీని ద్వారానే అన్ని విభాగాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే వేసవిలో లోడ్ పెరిగినపుడు సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతుంటాయి. ఇటువంటిన్నింటినీ అధిగమించేందుకుగాను జాగ్రత్తలు తీసుకున్న ఆసుపత్రి వైద్యాధికారులు ఈసారి మరిన్ని ముందస్తు చర్యలు చేపట్టారు. అత్యంత అధునాతనమైన మూడు జనరేటర్లను సమకూర్చుకోగలిగారు. ఇందులో 2500 కెవి సామర్ధ్యం కలిగి ఉండే జనరేటర్‌ను రూ.25 లక్షలు వెచ్చించి సమకూర్చగలిగారు. ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుంచి వీటిని ఖర్చుచేశారు. అలాగే సూపర్‌స్పెషాలిటీకి 60 కెవి సామర్ధ్యం కలిగిన జనరేటర్, దీంతోపాటు మరో 60కెవి సామర్ధ్యం కలిగి ఉండే జనరేటర్‌ను అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా మూడు జనరేటర్లు, మరో 15 ఇన్వివెర్టర్లు సిద్ధంగా ఉంచారు. ఏ క్షణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా వీటన్నింటినీ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కోటికి పైగానే వెచ్చించిన నాలుగు లిఫ్ట్‌లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇవి వస్తే రోగులను సులభంగా ఆయా విభాగాల నుంచి తీసుకువెళ్ళడం సులభతరంకానుంది. గత రెండు దశాబ్ధాల కాలంగా పనిచేయని వీటికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది.

వడదెబ్బతో మహిళా కూలీ మృతి
పద్మనాభం, ఏప్రిల్ 22: మండలంలో తునివలస గ్రామంలో శుక్రవారం వడదెబ్బ తగిలి మహిళా ఉపాధి కూలీ మృతి చెందినట్టు ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఏపిఓ గోవిందరావు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన కుసిడి వరహాలు (59) స్థానిక గ్రామంలోనున్న చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న వెంటనే ఎండిఓ ఆర్‌ఎం గ్లాడ్స్ పరామర్శించారు. పోలీసులకు పిర్యాదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇసుక మాఫియాపై సిఎస్‌కి ఫిర్యాదు
విశాఖపట్నం, ఏప్రిల్ 22: నగరంలో ఇసుక మాఫియా చెలరేగుతోందని, ఉచిత ఇసుకను కొంతమంది మాఫియా పక్కదారి పట్టిస్తున్నారంటూ తెలుగుదేశం ప్రచార కార్యదర్శి సనపల పాండురంగారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఠక్కర్‌కి ఫిర్యాదు చేశారు. నగరంలోని పలు పాయింట్లలో ఇసుక నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తరలించి, అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. ఫోటోలు, ఆధారాలతో సహా సిఎస్‌కి సనపల ఫిర్యాదు చేయడంతో అవాక్కయ్యారు. తక్షణమే ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎన్ యువరాజ్‌ను ఆదేశించారు.