విశాఖ

సెల్ టవర్‌ను తగులబెట్టిన మావోయిస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, అక్టోబర్ 12: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దారకొండలో బి. ఎస్. ఎన్. ఎల్. సెల్ టవర్ ఫ్యానల్ బోర్డులను సి.పి. ఐ. మావోయిస్టులు తగులబట్టి సుమారు కోటి రూపాయల విలువైన సామగ్రిని దగ్ధం చేసారు. దీంతో దారకొండ గ్రామ గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. మావోయిస్టులు కంచుకోటగా ఉన్న దారకొండ పరిసర ప్రాంతాల్లో గత కొంత కాలంగా మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో ఎంతో ప్రశాంతంగా ఉంది. బుధవారం రాత్రి మావోయిస్టులతో పాటు మిలీషియా, సానుభూతి పరులు 200 మంది దారకొండ గ్రామాన్ని చుట్టుముట్టి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. వాహనాలు గ్రామంలోకి రాకుండా మావోయిస్టు సెంట్రీలను ఏర్పాటు చేసి సెల్ టవర్ విధ్వంసానికి పాల్పడ్డారు. దారకొండ గ్రామానికి చెందిన కొంత మందిని మావోయిస్టులు ఆరా తీసారు. మరి కొంత మందిని టార్గెట్ చేసుకుని వారికి దేహశుద్ధి చేసేందుకు వారి ఇళ్ళవద్దకు వెళ్ళే సరికి వారు పరారయ్యారు. సాయుధులైన కొందరు మావోలు పి.హెచ్.సి. వద్దకు వెళ్ళి గంట పాటు ఎవ్వరూ బయటకు రావద్దని హెచ్చరించారు. దీంతో పి.హెచ్.సి. సిబ్బంది, పరిసర ప్రాంతాల వారు భయాందోళనకు గురై ఇంట్లో తలుపులు వేసుకుని కాలం వెళ్ళదీసారు. అనంతరం మావోయిస్టులు పాత టైర్లు, పెట్రోల్‌ను బి. ఎస్. ఎన్. ఎల్. ఫ్యానల్ బోర్డుల వద్దకు తీసుకువెళ్ళి తగులబెట్టారు. అనంతరం దారకొండ గ్రామంలో గాలికొండ ఏరియా కమిటీ పేరుతో గోడపత్రికలు అతికించడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.