విశాఖ

అభివృద్ధిని అడ్డుకుంటున్న వైకాపా నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, అక్టోబర్ 16: వైకాపా నాయకులు అభివృద్దిని అడ్డుకుంటున్నారని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత విమర్శించారు. మండలంలో బోడపాలెం, కొత్తూరు, చినబొడ్డేపల్లి గ్రామాల్లో మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు అధ్యక్షతన ఇంటింటా దేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపాకు చెందిన సర్పంచ్‌లు అవసరం ఉన్న చోట్ల రహదారులు నిర్మించుకుండా తమ ఇంటి ముందు, వెనుక రోడ్లును వేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్తగా ప్రవేశ పెడుతున్న పెళ్ళి కానుక పథకం కింద బి.సి. ఆడ పిల్లల పెళ్ళిళ్లుకు 30 వేలు, ఎస్సీ, ఎస్టీ ఆడ పిల్లల పెళ్ళిళ్ళుకు 35 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓ. ఎఫ్.డి. పథకంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి తక్షణం బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు లాలం కాశీనాయుడు, నాయకులు వేచలపు జనార్ధన్, జి.రెడ్డి నానిబాబు, చిటికెల సత్యనారాయణ, సుంకర బాబ్జి, వేచలపు భాస్కరరావులు పాల్గొన్నారు.