విశాఖ

పేదల సంక్షేమమే మోదీ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, అక్టోబర్ 16: సంక్షోభాన్ని అధిగమించి పేదలను ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప కొనియాడారు. ఇక్కడి రావుగోపాలరావు కళాక్షేత్రంలో సోమవారం జరిగిన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. అయినప్పటికీ బడుగు బలహీన వర్గాల వారికి నిధుల కేటాయింపులో తెలుగుదేశం ప్రభుత్వం సముచిత స్థానంకల్పిస్తుందన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో భాగంగా రైతు రుణాల మాఫీ, వృద్ధాప్య పింఛన్ల పెంపుదల తదితర ఎన్నో హామీలను అమలు చేస్తున్న ఘనతను ప్రభుత్వం దక్కించుకుందన్నారు. నిరుద్యోగ భృతి చెల్లింపునకు సైతం ప్రభుత్వం సన్నద్ధమవుతుందన్నారు. భూ ఆక్రమణలు అరికట్టడంతోపాటు భూమి అనుభవంలో ఉన్నవారికి పాతపుస్తకాలివ్వడం తదితర ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్థానిక ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అనకాపల్లిలో కాపుకార్పొరేషన్‌కు ఒక భవనం నిర్మించాల్సినవసరం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల నిధుల కేటాయింపులో అనకాపల్లికి సిఎం చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. మూతపడిన తుమ్మపాల సుగర్స్‌ను తెరిపించి ఆధునీకరించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. ఇందుకు అవసరమైన కృషి జరుగుతుందన్నారు. తుమ్మపాల సుగర్స్ ఆధునీకరణపై హోంమంత్రి చినరాజప్ప తనవంతు సహకారాన్ని అందించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మంత్రి గంటా 44కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసారన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్ష నేత జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్పను, ఎంపీ ముత్తంశెట్టి, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, జెడ్పీచైర్మన్ లాలం గంగా భవానీ తదితరులను ఎమ్మెల్యే పీలా గోవింద్ నేతృత్వంలో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, జెడ్పీచైర్మన్ లాలం గంగాభవానీ, ఎంపీపీలు పంచదార లక్ష్మి, కొణతాల సావిత్రి, జెడ్పీటిసిలు మలసాల ధనమ్మ, పల్లెల గంగాభవానీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంతులూరి రాజాబాబు, అర్భన్ దేశం ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర, డాక్టర్ విష్ణుమూర్తి, సత్యవతి, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల వెంకట్రావు, జిల్లా దేశం నాయకులు గుత్తా ప్రభాకర చౌదరి తదితరులు పాల్గొన్నారు.