విశాఖ

రంగురాళ్లను తవ్వేస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొలుగొండ, అక్టోబర్ 16: కరక, పప్పుశెట్టి పాలెం రంగురాళ్ళ క్వారీల్లో యథేచ్ఛగా రంగురాళ్ళ తవ్వకాలు సాగుతున్నాయి. గత నెల రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు క్వారీలోని సమీప గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుండి వచ్చిన కూలీలు తవ్వకాలు సాగిస్తున్నారు. కరక రంగురాళ్ళ క్వారీలో ఇతర జిల్లాల నుండి నర్సీపట్నంకు చెందిన వ్యాపారులు కూలీలను ప్రోత్సహించి తవ్వకాలు సాగిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఈక్వారీలో సుమారు 20 లక్షల వ్యాపారం సాగిందని కూలీలు బహిరంగంగా చెబుతున్నారు. ఈక్వారీలో 2004 డిసెంబర్‌లో 15 మంది కూలీలు మరణించినట్లు ప్రచారం సాగడంతో అప్పటి ఉన్నతాధికారులు తవ్వకాల నిరోధానికి నిఘా చర్యలు చేపట్టారు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో తవ్వకాలు నిరోధానికి మైనింగ్, పోలీస్, రెవెన్యూ , అటవీ శాఖ అధికారులు నిఘా చర్యలు చేపట్టారు. నిఘాతో పాటు కరక రంగురాళ్ళు, జీడిచెట్లు ప్రాంతంలో బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి నిత్యం గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. అదే విధంగా పప్పుశెట్టిపాలెం క్వారీ అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఈక్వారీలో భూ యజమానులుగా చెప్పుకుంటున్న యజమానులు సుద్దపాలెం, అడ్డల్లోవ, పప్పుశెట్టిపాలెం గ్రామాలకు చెందిన కొంత మంది కూలీలను ప్రోత్సహించి తవ్వకాలు సాగిస్తున్నారు. సోమవారం క్వారీప్రాంతాన్ని పోలీసులు పరిశీలించగా కొందరు తవ్వకం దారులు రంగురాళ్ళ తవ్వకాలకు ఉపయోగించిన పారలు వదిలి పరారయ్యారు. ఈక్వారీలో ఇప్పటి వరకు తవ్వకాలు జరుగకుండాప్రశాంతంగా ఉన్నప్పటికీ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ప్రచారం దావానంలా వ్యాపించడంతో సమీప గ్రామాల ప్రజలు తవ్వకాలకు పరుగులు తీస్తున్నారు. కరక రంగురాళ్ళ క్వారీల్లో అత్యంత విలువైన ఎలెక్స్, పప్పుశెట్టిపాలెం రంగురాళ్ళ క్వారీలో క్యాట్ ఐ వంటి విలువైన రంగురాళ్ళు లభించడంతో లక్షలాది రూపాయలు ఆర్జించవచ్చనే ఆశతో వ్యాపారులు కూలీలచే తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి రంగురాళ్ళ అక్రమ తవ్వకాల నిరోధానికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.