విశాఖ

నిరుపేదల ఆర్థికాభివృద్ధే టిడిపి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, అక్టోబర్ 17: నిరుపేదల ఆర్థ్ధికాభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత తెలిపారు. మండలంలో ఆక్సాయిపేట, చినబొడ్డేపల్లి గ్రామాల్లో మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిత పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే జన్మభూమి కార్యక్రమంలో అర్హులందరికీ సామాజిక ఫించన్లు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలోల్కి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. పెళ్ళి కానుక పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బి.సి. కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం సందర్భంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. మండల దేశం పార్టీ అధ్యక్షుడు కాశీనాయుడు, దేశం నాయకులు వేచలపు జనార్దన్, వేచలపు భాస్కరరావు, బాబ్జి పాల్గొన్నారు.
విజిలెన్స్ తనిఖీలు
మాడుగుల, అక్టోబర్ 17: మండలంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్.పి. ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ సి.ఐ. మల్లికార్జున రావు తన సిబ్బందితో కలిసి గ్రామంలో ఉన్న కళాశాల వసతి గృహం, మాడుగుల, కింతలిలలో ఉన్న బి.సి. హాస్టల్స్‌లను తనిఖీ చేపట్టారు. వసతి గృహాల వంట షెడ్లను పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆయన అనంతరం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల పరిసరాలు ఆహ్లాదంగా ఉండడంతో ఆయా వసతి గృహాల వార్డెన్లు సత్యనారాయణ, సూర్యనారాయణ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.