విశాఖ

మొరాయిస్తున్న సర్వర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), అక్టోబర్ 17: అగ్రిగోల్డ్ బాధితుల వద్దనున్న పత్రాలను పరిశీలించి వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు పట్టణంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐదురోజులుగా అగ్రిగోల్డ్ సంస్థ ఇచ్చిన బాండ్లను పరిశీలించే ప్రక్రియ చేపట్టారు. అనకాపల్లి పట్టణం, మండలంలోని సుమారుగా 1882మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నట్లు సమాచారం. అన్ని ప్రాంతాల్లోను ఒకేసారి ఈ పత్రాలను పరిశీలించి ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు చర్యలు తీసుకోవడంతో సర్వర్ తరచూ మొరాయిస్తోంది. దీంతో పత్రాలను పరిశీలించే పోలీస్ సిబ్బందికి, ఇటు అగ్రీగోల్డ్ బాధితులకు తిప్పలు తప్పడం లేదు. స్థానిక సిసిఎస్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద బాధితులకు కనీస సదుపాయాలు కల్పించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు తిండితిప్పలు లేకుండా గంటల తరబడి మండుటెండలో తమవద్దనున్న పత్రాలతో నిల్చోవడం అసహనానికి గురవుతున్నారు.